హీరోయిన్ నందితా శ్వేతా ఈ ఏడాది 'హిడింబ', 'మంగళవారం' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నారు. అందులో 'రాఘవ రెడ్డి' ఒకటి. ఈ సినిమాలో రాశి కుమార్తెగా ఆమె కనిపించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


శివ కంఠమనేని హీరోగా...
Siva Kantamneni New Movie: 'అక్కడొకటుంటాడు', 'మధురపూడి గ్రామం అనే నేను' చిత్రాల ఫేమ్ శివ కంఠమనేని హీరోగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై రూపొందిన సినిమా 'రాఘవ రెడ్డి' (Raghava Reddy Movie). criminals can not escape (నేరస్థులు తప్పించుకోలేరు)... అనేది ఉప శీర్షిక. సంజీవ్‌ మేగోటి దర్శకుడు. జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వర రావు, కె.ఎస్‌. శంకరరావు నిర్మాతలు. రాశీ, నందితా శ్వేతా ప్రధాన తారాగణం. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు.


'రాఘవ రెడ్డి' సినిమాలో శివ కంఠమనేని టైటిల్ రోల్ చేశారు. ఆయన ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారు. 'నిర్దోషులకు సహాయం చేసే అవకాశం పోలీస్ శాఖ నాకు కల్పించింది' అని రాఘవ రెడ్డి చెబుతాడు. అతనికి ఆ అవకాశం ఎందుకు ఇచ్చింది? పాఠాలు చెప్పే ప్రొఫెసర్ కొంత మందికి గుణపాఠాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన ఫైట్స్ ఎందుకు చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా 'రాఘవ రెడ్డి'ని తెరకెక్కించారని అర్థం అవుతోంది. 


'మా అయ్య మీ లెక్క కూతురు ఉంటే సంపేస్తా అనేటోడు మాత్రం కాదు' అని  నందితా శ్వేతా చెప్పిన డైలాగ్, ఆ ట్రైలర్ చూస్తుంటే... గొడవల కారణంగా విడిపోయిన భార్య భర్తలుగా శివ కంఠమనేని, రాశీ కనిపించనున్నారని ఊహించవచ్చు. వాళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో స్నేహా గుప్తా 'చదివిందే నే టెన్త్ రో... అయ్యింది డాక్టర్' అనే స్పెషల్ సాంగ్ చేశారు.


Also Read: 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌ హ్యాట్రిక్ కొట్టారా? లేదా?



''కొత్త కాన్సెప్టుతో తీస్తున్న చిత్రమిది. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. దర్శకుడు ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు. అజయ్ ఘోష్ కామెడీ విలన్ రోల్ చేశారు'' అని శివ కంఠమనేని చెప్పారు. శ్రీనివాసరెడ్డి, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, 'బిత్తిరి' సత్తి, రఘుబాబు, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ, 'చమ్మక్' చంద్ర, మీనా కుమారి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.


Also Read'సలార్'కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ - చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!



ఈ చిత్రానికి పోరాటాలు: 'సింధూరం' సతీష్‌, కొరియోగ్రఫీ: భాను - కిరణ్, కూర్పు: ఆవుల వెంకటేశ్‌, కళా దర్శకుడు: కె.వి. రమణ, మాటలు: అంజన్‌, పాటలు: సాగర్ నారాయణ, కెమెరా: ఎస్.ఎన్. హరీష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గంటా శ్రీనివాసరావు, సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్‌ మారియో.