Follow These Tips with Your Loved Ones : ఏ రిలేషన్లో అయినా గొడవలు కామన్. కుటుంబంలో, ఫ్రెండ్స్ మధ్యలో, కొలిగ్స్‌తో.. ఇలా ఎవరితోనైనా ఏదొక సమయంలో గొడవలు జరగవచ్చు. మీరు ఓపికతో ఉంటున్నారు కదా అని.. అవతలి వారు మిమ్మల్ని ఇంకా ఆగ్రహానికి గురిచేయవచ్చు. ఆ సమయంలో మీరు కూడా కోపానికి, ఇగోకి గురై.. రివర్స్‌లో బదులివ్వడం ఎంతసేపు? కానీ అనేస్తే వారికి, మీకు తేడా ఏముంది? వారు మీకు ఇచ్చిన బాధనే తిరిగి ఇవ్వడంలో అర్థమేముంది. పైగా కొన్నిసార్లు ఎదుటివారిని హర్ట్ చేసి మనమే ఎక్కువ బాధపడిపోతాము. అలాంటప్పుడు మీ కోపాన్ని, అహాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం.
స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఇది ఎదుటివారికోసం కాకపోయినా.. వ్యక్తిగత ఎదుగుదలకు చాలా అవసరం. అహం, కోపం మీలో ఎక్కువైపోతే.. మీ సంబంధాలు దూరమైపోతాయి. కాబట్టి పక్కకు నెట్టేయడం కన్నా.. పక్కకు వెళ్లిపోవడమే బెటర్. మీరు రిలేషన్స్‌ను హెల్తీగా ఉంచుకునేందుకు.. కోపాన్ని, ఇగోని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కొన్ని ట్రై చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనసుకు ఎక్కువగా తీసుకోకండి..
ఏ విషయాన్నైనా మనసుకు ఎక్కువగా తీసుకుంటే అది చివరకు మిమ్మల్ని సఫర్ చేస్తుంది. కాబట్టి మీ కోపాన్ని, ఇగోని కంట్రోల్ చేయడం కోసం మీరు ఏ విషయాన్ని అయినా మనసుకు తీసుకోవడం తగ్గించండి. ఇది మీరు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. లేదంటే అదే మీకు ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది. ఎదుటివారు మిమల్ని హర్ట్ చేస్తుంటే దానికి మనస్తాపం చెందకుండా ఉండగలిగితే సగం సమస్యలు క్లియర్ అయిపోతాయి. వారు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారో మీకు ఓ క్లారిటీ వస్తుంది.
మనమే గొప్పకాదు..
కొన్నిసార్లు ఎదుటివారు చెప్పేది వినలేకపోవచ్చు ఎందుకంటే మనమే గొప్ప.. వారికేమి తెలుసు అనే ధోరణి మనల్ని కమ్మేస్తుంది కాబట్టి. ఆ సమయంలో మీలో అహం పెరుగుతుంది. కాబట్టి అన్నివేళల మనమే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కాబట్టి.. పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముందు ఎదుటివారు చెప్పింది వినండి. అది మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సరే.. వారు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది గమనించి.. మీ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి బదులు మీరేమి చేస్తే బాగుంటనేది క్లారిటీ తెచ్చుకోండి. వాళ్లకేమి తెలుసు అనుకుంటే మాత్రం మీలో అహం సునాయసంగా పెరిగిపోతుంది.
ఎప్పుడు ఆపాలో తెలుసుకోండి..
కొందరికి మొదలు పెట్టడం బాగా తెలుసు కానీ.. ఎక్కడ ఆపాలో తెలియదు. కొన్నిసార్లు తెలియకుండానే మనం బదులు ఇస్తూ ఉంటాము. కానీ.. ఆ మాటల్లో ఎంత నిజం ఉన్నా సరే.. ఎక్కువయ్యే కొద్ది బాధతోపాటు కొన్ని అనరాని మాటలు అనేస్తాము. అవి ఎదుటివారిని హర్ట్ చేస్తాయి. కాబట్టి ఎక్కడ మొదలు పెట్టినా సరే.. ఎక్కడ ఆపేస్తే మీ రిలేషన్ మంచిగా ఉంటుందో గుర్తించండి. మీ పాయింట్ అయిపోయింది ఇంక మాట్లాడాల్సిన పని లేదనుకున్నప్పుడు అక్కడితో ఆగిపోండి. దానిని ఫాలో అయితే మీ సంబంధాలు ఎల్లప్పుడూ హెల్తీగా ఉంటాయి.
ఆధిపత్యం వద్దు
అహం లేదా కోపం అనేది ఇతరులపై ఆధిపత్యాన్ని చూపించేలా చేస్తుంది. ఇది ఎదుటివారి భావాలను దెబ్బతీసేలా చేస్తుంది. హర్ట్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అనుకుంటారు కానీ.. అది చాలా రూడ్ బిహేవియర్ అవుతుంది. మీరు ఒకవేళ ఎదుటివారి కన్నా ఎక్కువ స్థానంలో ఉన్నా సరే.. ఆధిపత్యం చూపించకుండా ప్రేమతో పని చేయించుకుంటే సరిపోతుంది. ఎదుటివారిపై ప్రేమ చూపించకపోయినా పర్లేదు కానీ.. సానుభూతి, కరుణ వంటివి మాత్రం చూపించాలి. ప్రతి ఒక్కరిలోనూ మీరు గుర్తించలేని బలాలు ఉంటాయి. అవసరాలు ఉంటాయి. కాబ్టటి మీ అహాన్ని, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తప్పేమి కాదు.
సక్సెస్ మాత్రమే కాదు..
కొందరు ఎదుటివారి సక్సెస్ రేట్‌ని చూసి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే మేము మాత్రమే సక్సెస్ అయ్యామని గొప్పగా చెప్పుకుంటారు. సక్సెస్ అవ్వడం మంచిదే కానీ.. దానిని తలకు ఎక్కించుకోవడం వల్ల అహం పెరుగుతుంది. ఇది మీ చుట్టూ ఉన్నవారిని మీకు దూరం చేస్తుంది. అలాగే ఎప్పుడూ సక్సెస్ అవ్వడం ఎవ్వరి వల్ల కాదు. దానికో టైమ్ వస్తుంది. అప్పుడే మాత్రమే దానిని యాక్సెప్ట్ చేయాలి. అంతేకానీ మీకు సక్సెస్ ఉందని.. ఎదుటివారికి లేదనే పొగరు ఉండకూడదు. లేదంటే ఎదుటివారి సక్సెస్‌ని చూసి ఏడ్వకూడదు. ఈ రెండూ మీలో ఉన్నప్పుడు మీ రిలేషన్స్ అన్ని బాగుంటాయి.
గెలిచినా.. ఓడినా లైఫ్ ఎలా ముందుకు సాగాలో అలాగే వెళ్తుంది. రిలేషన్కూడా అంతే ఓ గొడవలో అవతలి వారు నెగ్గినా.. మీరు తలొగ్గినా.. రిలేషన్ కూడా అలా ముందుకు వెళ్లేలా చూసుకోండి. ఎవరూ గెలిచినా.. ఓడినా.. మీకు నచ్చినవారితో ఉండాలనుకుంటే కోపాన్ని, అహాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి.
Also Read : కొవిడ్ జెఎన్ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?