రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే ఆయన కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ డ్రామా 'సలార్' క్రేజ్ ప్రేక్షకులలో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ.‌ మార్చి 21న ఈ సినిమా‌ రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పది అంటే పది నిమిషాల్లో థియేటర్లో నాలుగు షో టికెట్స్ సేల్ అయ్యాయి. 


సుదర్శన్ 35లో 'సలార్' రికార్డ్!
హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో సుదర్శన్ హాలుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ సినిమా చూడడం అభిమానులకు ఒక అనుభూతి. అందుకని పని కట్టుకుని మరి ఆ థియేటర్ దగ్గరకు వెళ్ళి టికెట్స్ తీసుకుని సినిమాలు చూస్తారు. ఈ సలార్ సైతం మార్చి 21న సుదర్శన్ 35 ఎంఎంలో రిలీజ్ అవుతోంది. ఇవాళ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు.


పది అంటే కేవలం పది నిమిషాల్లో సుదర్శన్ 35లో మార్చి 21వ తేదీ ప్రదర్శించే నాలుగు షోస్ టికెట్స్ అన్ని అమ్ముడు అయ్యాయి. ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పాలి. సుదర్శన్ సహా మరికొన్ని థియేటర్లలో సినిమా మళ్లీ విడుదల అవుతోంది. అన్నిచోట్ల బుకింగ్స్ బాగున్నాయి.


Also Read'కోర్టు చూడండి... నచ్చకపోతే నా 'హిట్ 3' చూడటం మానేయండి' అని నాని చెప్పారు. మరి, కోర్టు ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి










రెండు షూటింగులతో ప్రభాస్!
ప్రస్తుతం ప్రభాస్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఒక వైపు మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రీకరణ చేస్తున్నారు. మరొక వైపు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ చిత్రీకరణ చేస్తున్నారు. కొన్ని రోజులు ఒక సినిమా... మరి కొన్ని రోజులు మరొక సినిమాకు డేట్స్ కేటాయిస్తున్నారు. దాంతో ఆయన ఫుల్ బిజీ. ఆ మధ్య గాయం కావడం వల్ల కొన్ని రోజుల పాటు చిత్రీకరణలకు విరామం ప్రకటించారు. మళ్లీ ఆయన షూటింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం అందింది.


'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలు కాకుండా... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా అంగీకరించారు ప్రభాస్. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ పనుల మీద బిజీగా ఉన్నారు. తన సినిమా చేసేటప్పుడు మరొక సినిమాకు డేట్స్ ఇవ్వకుండా మొత్తం తనకే కావాలని హీరో దగ్గర ఆయన ఒక రిక్వెస్ట్ ఉంచారట. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సీక్వెల్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి ‌2898 ఏడీ' సీక్వెల్ కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది.‌