Sai Pallavi Sister Pooja Marriage Soon: న్యాచురల్‌ బ్యూటీ సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. త్వరలో మరో హీరోయిన్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. సాయి పల్లవికి ఓ చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు పూజకన్నన్‌. తమిళంలో చిత్తరాయి సెవ్వనం అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రస్తుతం సోషల్‌ వర్కర్‌గా వ్యవహరిహిస్తోంది. ఒక్క సినిమాతోనే నటనకు బ్రేక్‌ ఇచ్చిన పూజ తరచూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటుంది.


ఇప్పుడు పూజ తన పెళ్లి కబురుపై హింట్‌ ఇచ్చింది. రిలేషన్‌లో ఉన్నానంటూ తాజాగా బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. అతడి పేరు వినీత అని, తన క్రైం పార్ట్‌నర్‌ అయిన వినీత్‌ ఇప్పుడు తన లైఫ్‌ పార్ట్‌నర్‌ కాబోతున్నాడంటూ కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ అతడి గురించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. 


ఐ లవ్‌ యూ పార్ట్‌నర్‌..


ఈ సందర్భంగా అతడితో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. "ఈ క్యూట్‌ బటన్‌ నిశ్వార్థమైన ప్రేమ, ఓపికగా ఉండటం.. ఎప్పుడూ ప్రేమతో ఉండటం నేర్పించింది. ఇతను వినీత్‌.. నా సన్‌షైన్‌. మొన్నటి వరకు నా క్రైం పార్ట్‌నర్‌ .. ఇప్పుడు నా లైఫ్‌ పార్ట్‌నర్‌ కాబోతున్నాడు. ఐ లవ్‌ యూ మై పార్ట్‌నర్‌" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో ఆమె ఇండస్ట్రీ వర్గాలు, సన్నిహితులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చెల్లి పెళ్లిపీటలు ఎక్కుతుందనగానే.. సాయి పల్లవి పెళ్లి ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలోనూ ఎన్నోసార్లు సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి.






మరోసారి సాయి పల్లవి పెళ్లిపై ప్రశ్నలు


కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. సాయి పల్లవి పెళ్లి మ్యాటర్‌ హాట్‌టాపిక్‌గా ఉన్న తరుణంలో ఇప్పుడు ఆమె చెల్లి పెళ్లి కబురు రావడంతో అంతా సాయి పల్లవి పెళ్లెప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఫస్ట్ సనిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.  ఆ తర్వాత వరసగా ఆఫర్లు అందుకుంటూ.. 'ఫిదా', 'లవ్‌స్టోరీ' చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం 'తండేల్‌'లో నటిస్తుంది. ఈ సినిమాలో మరోసారి నాగచైతన్యతో జతకట్టింది. ఇటీవలె ఈ మూవీలో సెట్‌లోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. కోస్టర్‌ ఏరియాలో నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్‌ రీసెంట్‌ కేరళలోని తిరువనంతపురంలో షూటింగ్‌ షెడ్యూల్‌ జరుపుకుంది. అక్కడ నాగ చైతన్య-సాయి పల్లవి మధ్య సాగే లవ్‌ సీన్స్‌, పాటలు, రొమాంటిక్‌ సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. అలాగే తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమాకు కమిట్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంటుంది. 


Also Read: అయోధ్య రామామందిరానికి దగ్గర్లో భూమి కొన్న అమితాబ్‌ - త్వరలో సొంత ఇంటి నిర్మాణం, ఎన్ని కోట్లంటే?