Sai Pallavi And Junaid Khan Photos Viral: వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది సాయి పల్లవి. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్ బ్యూటీ.. ప్రస్తుతం అమీర్ ఖాన్ కొడుకు జునాయిద్ ఖాన్ తో ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పోయిన ఏడాది డిసెంబర్ 1న మొదలైన ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం జపాన్ లో జరుగుతోంది. అక్కడ సాయి పల్లవి, హీరో జునాయిద్ ఇద్దరు మంచులో ఆడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా రొమాంటిక్ ప్రేమ కథగా తెలుస్తోంది.
స్నో ఫెస్టివల్ లో సాయి పల్లవి..
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు మేకర్స్. ఇక ఈ ఏడాదే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే, షూటింగ్ కి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా డెడికేషన్ తో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లోని సప్పూరా అనే ప్లేస్ లో జరుగుతోంది. అక్కడ స్నో ఫెస్టివల్ లో సాయి పల్లవి, జునాయిద్ మంచుతో ఆడుకుంటున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇద్దరు వింటర్ ఔట్ ఫిట్ లో కనిపించారు. ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. ఆ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడటం కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. లొకేషన్స్ వేటలో ఉన్నప్పుడు ఈ స్నో ఫెస్టివల్ గురించి తెలుసుకున్న మేకర్స్.. దాంట్లోనే షూట్ చేసేందుకు సిద్ధమయ్యారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ ఉన్న ప్రత్యేకమైన కల్చర్, అక్కడ ఉన్న అందాలను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో.. షూట్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ని ముంబైలో ముగించిన టీమ్. ఇప్పుడు జపాన్ లో షూటింగ్ చేస్తోంది.
జునాయిద్ ఖాన్ కి రెండో మూవీ..
అమీర్ ఖాన్ కొడుకు జునాయిద్ ఖాన్ కి ఇది రెండో సినిమా. ఆయన నటించిన మొదటి సినిమా 'మహారాజా'. 1862లోని ఒక మహారాజుకి సంబంధించి స్టోరీ ఇది. ఆదిత్య చోప్రా దీనికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా నెట్ ఫ్లక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
బిజీ బిజీగా సాయి పల్లవి
ఈ మధ్యే చెల్లి పెళ్లిలో ఎంజాయ్ చేసిన సాయి పల్లవి తిరిగి షూటింగ్ మోడ్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న ఆమె.. ఆ తర్వాత కూడా బిజీ బిజీగా గడపనున్నారట. తమిళ సినిమా ఎస్ కే - 21లో శివకార్తికేయన్ సరసన ఆమె నటించనున్నారు. రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఇక తెలుగులో మరోసారి నాగ చైతన్యతో కలిసి నటించనుంది సాయి పల్లవి. తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని చందూ మోండేటి డైరెక్ట్ చేయనున్నారు.
Also Read: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా’ మర్డర్ కేసు - ఉత్కంఠ రేకిస్తున్న ట్రైలర్, రిలీజ్ డేట్ ఫిక్స్