The Indrani Mukerjea Story: Buried Truth Trailer: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసులలో షీనా బోరా హత్య కేసు ఒకటి. 2012లో షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సొంత తల్లే బిడ్డను చంపిందని తెలిసి దేశ వ్యాప్తంగా ప్రజలు షాక్ కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించింది. 2022 మేలో జైలు నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ ను తెరకెక్కించింది. త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేసింది. 


ట్రైలర్ లో ఏం చూపించారంటే?


‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ లో షీనా బోరా హత్యతో పాటు పాటు ఇంద్రాణీ ముఖర్జీ పెళ్లిళ్లు, విడాకులు, జైలు జీవితాన్ని కంప్లీట్ గా చూపించబోతున్నారు. 2015లో బయటకు వచ్చిన షీనా బోరా హత్య కేసుకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది? అనే పూర్తి వివరాలను ఇందులో ప్రస్తావించారు. పలువురు జర్నలిస్టులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ల అభిప్రాయాలను ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కేసుకు సంబంధించి నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఏం చూపించబోతుంది? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. దాంతో పాటు రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.



ఇంతకీ షీనా బోరా కేసు కథేంటి?


2015లో షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కన్నతల్లే కూతుర్ని చంపేసిందన్న నిజం తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. 2012, ఏప్రిల్‌ లో 24 ఏళ్ల షీనా బోరాను త‌ల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవిలో షీనా బోరా డెడ్ బాడీని కాల్చివేశారు. ఈ కేసు విషయం 2015లో బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు పాలయ్యారు. ఈ డ్యాకుమెంటరీ ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో షానా లెవీ, ఉరాజ్ బహల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.  






Read Also: పిచ్చోడా చచ్చిపోతావ్ అన్నారు - డాక్టర్లే షాకయ్యారు: నటుడు సురేష్