12th Fail Only Indian Film In IMDb’s Global Top 250 List: సినిమాలో స్టఫ్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంఫుల్ ‘12th ఫెయిల్‌’ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మనోజ్ కుమార్ అనే IPS అధికారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విక్రాంత్ మన్సే ప్రధాన పాత్ర పోషించారు. విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు.


IPS అధికారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ‘12th ఫెయిల్‌’


‘12th ఫెయిల్‌’ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల అయ్యింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు వినోద్. అనురాగ్ పాఠ‌క్ రాసిన న‌వ‌ల ఆధారంగా ‘12th ఫెయిల్’ సినిమా తీశారు దర్శకుడు వినోద్. ఈ  సినిమాలో మ‌నోజ్ కుమార్ అనే IPS ఆఫీసర్‌ పాత్రలో విక్రాంత్ మస్సే అద్భుతంగా నటించాడు. 12వ త‌ర‌గ‌తిలో ఫెయిల్ అయిన ఆయన జీవితాన్ని గడపడం కోసం ఆటో డ్రైవర్‌గా మారుతాడు. అయితే, IPS అధికారి కావాలనే తన కలను మాత్రం మరిచిపోడు. చివరకు ఆ ఆటో డ్రైవర్‌ IPSగా ఎలా మారాడు అనేది చాలా ఇన్‌స్పైరింగ్‌గా చూపించారు. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 


IMDb గ్లోబల్ టాప్ 250 చిత్రాల జాబితాలో చోటు


తాజాగా ‘12th ఫెయిల్‌’ సినిమా ఓ అరుదైన ఘనతను సాధించింది. IMDb గ్లోబల్ టాప్ 250 చిత్రాల జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ లిస్టులో ‘12th ఫెయిల్‌’ 50వ స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు,  సినమాకు సంబంధించిన  ర్యాంకింగ్ స్క్రీన్‌షాట్‌ ను అభిమానులతో పంచుకున్నారు. “నేను ఇప్పటికీ కాశ్మీర్‌కు చెందిన చిన్న పిల్లవాడినే. సినిమా ప్యారడిసో పక్కనే నా సినిమా ఉండటం చూసి నోట మాటరావడం లేదు. ఇక ప్రశాంతంగా చనిపోతా” అంటూ రాసుకొచ్చారు.






IMDb అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ మూవీగా గుర్తింపు


ఇప్పటికే ‘12వ ఫెయిల్’  చిత్రంలో IMDb అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ చిత్రం ఇటీవలే మకావు ఆసియా-యూరోప్ యంగ్ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకుంది. ‘12th ఫెయిల్’ సినిమా ఆస్కార్స్‌ కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లినా షార్ట్ లిస్ట్ కాలేదు. ఈ చిత్రంలో మేధా శంకర్‌, అనంత్ జోషి, అన్షుమాన్‌ పుష్కర్‌, ప్రియాంషు చటర్జీ, గీతా అగర్వాల్‌, హరీష్‌ ఖన్నా, సరితా జోషి కీలక పాత్రలు పోషించారు. వినోద్‌ చోప్రా ఫిల్మ్స్‌ బ్యార్ లో విధు వినోద్‌ చోప్రా, యోగేష్‌ ఈశ్వర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  


Read Also: మోడీగా మారిన ‘రాముడు’ - ‘ఆర్టికల్ 370’లో ప్రధానిగా రామాయణం స్టార్ అరుణ్ గోవిల్ సర్‌ప్రైజ్