Rashmi Gautam Respond on Guntur Kaaram Rumours: యాంకర్‌ రష్మి గౌతమ్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయ్యింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమానే రిజెక్ట్‌ చేసిందా? అంటూ ఫ్యాన్స్‌ ఆమెపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రష్మీ గుంటూరు కారం మూవీలో నటించే చాన్స్‌ వచ్చిందని, దానికి ఆమె నిరాకరించందంటూ రెండు, మూడు రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం' సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి..' సాంగ్ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఎక్కడ చూసిన ఇదే సాంగ్‌ మారుమోగుతుంది.


అయితే ఈ సినిమా ఓటీటీకి రావడంతో ఇందులో పలు క్లిప్స్‌ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ఈ క్రమంలో యాంకర్‌ రష్మి గౌతమ్‌కు కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో నటించే అవకాశం వచ్చిందంటూ వార్త కూడా బయటకు వచ్చింది. నటి పూర్ణ స్థానంలో మొదట రష్మినే మూవీ టీం సంప్రదించిందని, కానీ ఆమె రిజెక్ట్‌ చేయడంతో పూర్ణ తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది కాస్తా వైరల్‌ కావడంతో ఈ వార్త రష్మి కంటపడింది. దీంతో ఈ వార్తలపై స్పందించింది రష్మి. ఈ వార్తలకు సంబంధించిన స్క్రిన్‌‌ షాట్లను తీసి తన ఎక్స్‌ పోస్ట్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ఈ వార్తలను ఆమె ఖండించింది. 


Also Read: మరో వివాదంలో అమోజాన్‌ ప్రైమ్‌ వీడియో - అక్కడ కేసు నమోదు!


"ఈ వార్తలను నమ్మకండి. 'గుంటూరు కారం' సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్‌ కోసం నన్ను సంప్రదించినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఇదంతా ఫేక్‌. అసలు 'గుంటూరు కారం' టీం నన్ను సంప్రదించనే లేదు. అలాంటప్పుడు నేను మూవీని నిరాకరించే చాన్స్‌ ఎక్కడిది?" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తల కారణంగా తనపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందని రష్మి ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి ఇలాంటి వార్తలను ప్రోత్సహించవద్దని ఆమె నెటిజన్లను కోరింది. అంతేకాదు ఈ సాంగ్‌లో నటి పూర్ణ గారు చాలా బాగా నటించారని, ఆమెను మరెవరు భర్తి చేయలేరని పేర్కొంది. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడింది. కాగా 'గుంటూరు కారం'లో కుర్చీ మడత పెట్టి సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందే తెలిసిందే.






యుట్యూబ్‌లో ఈ సాంగ్‌ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇందులో మహేష్‌ తన మాస్‌ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు. మహేష్‌ అలా మాస్‌ స్టెప్స్‌లతో అలరించడం మొదటి సారి. దీంతో ఫ్యాన్స్‌ అంతా ఇందులో మహేష్‌ జోష్‌, డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ఇక శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి తన ఎనర్జిటిక్‌ డాన్స్‌లో కుర్చి మడత పెట్టిలో చూపించింది. అయితే ఈ సాంగ్‌లో నటి పూర్ణ కూడా గెస్ట్‌ అప్పిరియన్స్‌ ఇచ్చింది. రాజమండ్రి రాగ మంజరి, ఏం రసిక రాజువో మరి.. లైన్స్‌లో పూర్ణ స్టెప్పులు వేసింది. రెండు లైన్లలోనే కనిపించినప్పటికీ పూర్ణకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే పూర్ణ పోషించిన పాత్ర కోసమే రష్మిని 'గుంటూరు కారం' టీమ్‌ సంప్రదించిందంటూ రూమర్‌ పుట్టించారు.