Lawsuit On Amazon Prime: ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అమెజాన్‌ ప్రైం వీడియో ఒకటి. వరల్డ్‌ వైడ్‌గా దాదాపు 100 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లతో టాప్‌లో కొనసాగుతోంది ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అమెజాన్‌ ప్రైం వీడియో మరోసారి తాజాగా చిక్కుల్లో పడింది. ఇప్పటికే సబ్‌స్క్రిబ్షన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయంటూ పలుమార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పలు చిత్రాలు వెబ్ షోస్ పరంగా మాత్రం ప్రైమ్ వీడియో టాప్ లోనే గట్టి పోటీ ఇస్తుంది. అయితే సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందు అమెజాన్‌ తాజాగా ఓ ప్లాన్‌ను తీసుకువచ్చింది.


ఇప్పుడు అదే దానిని వివాదంలో పడేసింది. అప్పటికే ఫ్రీ యాడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వినియోదారుడికి మళ్లీ యాడ్‌ ఫ్రీ అంటూ అదనపు చార్జీలు వేసిందట అమెజాన్‌. దాంతో మండిపోయిన సబ్‌స్క్రైబర్‌  కోర్టును ఆశ్రయించాడు. అమెజాన్ కంపెనీ ప్రైమ్ సభ్యులను తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ ఓ వినియోగదారుడు కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇది ఇక్కడ కాదు. అమెరికాలో. యూఎస్‌లోని కాలిఫోర్నియాకు చెందిన విల్బర్ట్ నెపోలియన్ అమెజాన్‌ సంస్థపై 18 పేజీల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో అతడు అమెజాన్‌ సంస్థ.. వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించిందని, తమ లాభం కోసం యాడ్‌ ఫ్రీ పేరుతో సబ్‌స్క్రైబర్లపై అదనపు భారం మోబుతుందంటూ మండిపడ్డాడు.


Also Read: మహేష్‌-రాజమౌళి మూవీ టెక్నికల్‌ టీం ఇదే? - ట్రైటిల్‌ కూడా మారింది, ఇకపై SSMB కాదట!


ఆల్రెడీ వార్షికంగా ఉన్న చార్జెస్‌ని వరల్డ్ వైడ్‌గా కూడా పెంచారు. ఇదే భారం అనుకుంటే మళ్ళీ ఆ సబ్ స్క్రిప్షన్ లో యాడ్స్ వేస్తామని మళ్ళీ యాడ్స్ లేకుండా చూడాలి అంటూ ఇంకా అదనంగా డబ్బులు చెల్లించాలంటూ అమెజాన్‌ కండిషన్‌ పెడుతుందని పేర్కొన్నారు. కాగా అమెజాన్‌ తన సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు కొత్త ప్లాన్‌ తీసుకువచ్చింది. దీనిని గత జనవరి 29 నుంచి స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా యాడ్‌ ఫ్రీ కోసం కొత్త వినియోగదారుల కోసం అమెజాన్ తన యాడ్ టైర్‌ను డిఫాల్ట్‌గా మార్చింది. దీంతో ఇది పాత సబ్‌స్క్రైబర్లపై కూడా ప్రభావం చూసింది. ఇప్పటికే యాడ్‌ ఫ్రీ వార్షిక ప్లాన్‌ తీసుకున్న వారికి కూడా ఫ్రీ యాడ్ కోసం అదనంగా చెల్లించాలని చూపిస్తోంది. అయితే ఇప్పుడు దీనిపై కాలిఫోర్నియాకు సబ్‌స్క్రైబర్‌ కేసు నమోదు అయ్యింది.


గత డిసెంబర్‌లో తన సబ్‌స్క్రిబ్షన్‌ను వార్షికానికి తీసుకోగా తనకి మళ్ళీ యాడ్ ఫ్రీ చూడాలి అంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారని కోరుట్లో కేసు వేశాడు. తాను ప్రైమ్ వీడియో తీసుకున్నదే ఎలాంటి అడ్వర్టైస్మెంట్ లు లేకుండా చూసేందుకే అని అమెజాన్‌ కూడా అలానే చెప్పడంతో తాను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు అదనంగా డబ్బులు వసూలు చేస్తుండడం సరికాదని, ఇది వినియోగదారులు మోసగించడమే అని అతడు పేర్కొన్నాడు. వెంటనే అమెజాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్‌ చేశాడు. అయితే దీనిపై ఇంకా ప్రైమ్ వీడియో స్పందించలేదని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ప్రైమ్ వీడియో ఎలా రియాక్ట్‌ అవుతుంది, ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి. కాగా ఇదే ప్లాన్‌ అమెజాన్‌ ఇండియాకి కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.