Sai Dharam Tej Satires on Some Telugu Websites: సాయి ధరమ్ తేజ్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఆయన. తన సినిమాలకి సంబంధించి విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు. అయితే, తన గురించి, తన సినిమాల గురించి మాత్రం మీడియాలోని వచ్చే వార్తల వల్లే తెలుసుకుంటానని, కొన్ని వెబ్ సైట్స్ ద్వారా తనకు ఇన్ఫర్మేషన్ వస్తుందని, తన గురించి తనకంటే వాళ్లకే ఎక్కువగా తెలుస్తుంటాయి అంటూ సెటైర్లు వేశారు ఆయన. 'సత్య'కి సంబంధించి ఉమెన్స్ డే స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి సెటైరికల్ సమాధానాలు చెప్పారు సాయి ధరమ్ తేజ్.
మీ ద్వారానే తెలుసుకుంటాను..
'సత్య' అనే మ్యూజికల్ షార్ట్ ఫిలిమ్ రిలీజ్ సందర్భంగా ఉమెన్స్ డే స్పెషల్ చిట్ చాట్ పెట్టారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు సాయి ధరమ్ తేజ్. "'గాంజా శంకర్' సినిమా ఆగిపోయిందా?" అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. తనకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని అన్నారు ఆయన. "ఒక తెలుగు వెబ్ సైట్ లో నేను కూడా చూశాను సార్. నోటీసుల విషయంలో కూడా నేను వెబ్ సైట్స్ లోనే చదివాను. నాకు అఫీషియల్ గా మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. మేకర్స్ నాకేమీ చెప్పలేదు. 'గాంజా శంకర్' సినిమా ఆగిపోయింది అని కొన్ని వెబ్ సైట్స్ లో చూశాను నేను. నా కంటే ముందు అన్నీ మీకే తెలుస్తాయి కదా. అందుకే ఎవరో పంపిన లింక్స్ చూసి, అర్రే సినిమా ఆగిపోయిందా? సినిమా మళ్లీ స్టార్ట్ అయ్యిందా? అని తెలుసుకుంటాను" అని సెటైరికల్ గా కొన్ని వెబ్ సైట్స్ పేర్లు చెప్పి వాళ్లు రాసే వార్తల గురించి స్పందించారు సాయి ధరమ్ తేజ్. కొన్నిసార్లు కొంతమంది చేసే ట్వీట్ల వల్ల తాను సినిమాలు మానేస్తున్నాను అంటూ నవ్వుతూ సమాధానాలు చెప్పారు.
'గాంజ శంకర్' సినిమాపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సినిమా టైటిల్ మార్చాలంటూ, 'గాంజా శంకర్' అనే టైటిల్ నుంచి 'గాంజా' తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో ఆ నోటీసులను జారీ చేసింది. '‘గాంజా శంకర్'లో గంజాయి, డ్రగ్స్‌ను ఉపయోగించడం గురించి గొప్పగా చూపించరని ఆశిస్తున్నాం. యూత్‌పై ప్రభావం చూపించే సీన్స్ ఉండవని భావిస్తున్నాం. అందుకే 'గాంజా శంకర్' అనే టైటిల్ నుండి గాంజాను తొలగించాలని ఆదేశిస్తున్నాం. అంతే కాకుండా సినిమాలో గంజాయి, నార్కొటిక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే 1985 ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవు’ అంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నోటీసులను సాయి ధరమ్ తేజ్‌తో పాటు నిర్మాత నాగవంశీ, దర్శకుడు సంపత్ నందికి కూడా పంపించింది.
ఇక సత్య మ్యూజిక్ వీడియోని మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దాంట్లోసాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మ్యూజిక్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ తన పేరును మార్చుకున్నట్లు స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా చెప్పారు. సాయి దుర్గ్ తేజ్ గా తన పేరును మార్చుకున్నానని, తండ్రి పేరు ఇంటిపేరుతో ఎలాగో సంక్రమిస్తుంది కాబట్టి తల్లి పేరును యాడ్ చేసుకున్నానని చెప్పారు ఈ సుప్రీమ్ హీరో.
Also Read: తల్లి మీద ప్రేమతో మరోసారి పేరు మార్చుకున్న మెగా హీరో!