మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త సినిమాకు సంతకం చేశారు. రోడ్డు ప్రమాదం తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన... మూడు నెలల క్రితం SDT 15 Movie షూటింగ్ స్టార్ట్ చేశారు. సముద్రఖని దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు. లేటెస్టుగా రామ్ చరణ్‌కు మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నందితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


Sai Dharam Tej to act in Sampath Nandi direction, Its Official: అవును... దర్శకుడు సంపత్ నందికి మరోసారి మెగా కుటుంబంలోని యువ కథానాయకుడితో సినిమా చేసే అవకాశం వచ్చింది. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'రచ్చ' తీశారు. ఇప్పుడు సాయి తేజ్‌తో సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నేడు సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించారు.
  
గోపీచంద్ 'సీటీమార్' తర్వాత సంపత్ నంది చేస్తున్న చిత్రమిది. ఇది కాకుండా నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం ఆయన ఒక కథ రెడీ చేశారు. అలాగే, 'విక్రమార్కుడు' సీక్వెల్ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.


Also Read : సాయిపల్లవికి ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు..?


సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా విషయానికి వస్తే... బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శకత్వంలో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. అందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 


Also Read : సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్