విశ్వక్ సేన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్:


విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జునకళ్యాణం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి హిట్  వచ్చింది. ప్రస్తుతం విశ్వక్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమా కూడా ఒప్పుకున్నారు. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే.. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అలానే ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మిస్తున్నఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. 




Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది


Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?


'టెన్త్ క్లాస్ డైరీస్' ట్రైలర్:


శ్రీరామ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'టెన్త్ క్లాస్'. ఇప్పటివరకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. అచ్యుత రామారావు, రవితేజ మన్యం నిర్మించారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. టెన్త్ క్లాస్ లో విడిపోయిన బంధాన్ని వెతుక్కుంటూ హీరో విదేశాల నుంచి ఇండియాకు వస్తారు. కానీ అప్పటికే హీరోయిన్ లైఫ్ లో ఎన్నో విషాదాలు ఉంటాయి. మళ్లీ ఆమెని కలిసే ప్రయత్నంలో హీరో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే సినిమా.