రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) పేరు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం... డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల బారిన పడిన లేటెస్ట్ హీరోయిన్ ఆమె. రుక్మిణీ వసంత్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ డీప్‌ఫేక్ - ఏఐ జనరేటెడ్ వీడియో, ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు రుక్మిణీ వసంత్ ఫిర్యాదు చేశారు. ఇంకా ఆవిడ ఏమన్నారంటే?
హీరోయిన్లకు మాత్రమే కాదు... సాధారణ మహిళలకూడీప్ ఫేక్ వీడియో, ఫోటోలపై సైబర్ క్రైమ్ విభాగం సమగ్ర విచారణ జరుపుతుందని, ఆ డిపార్ట్మెంట్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని రుక్మిణీ వసంత్ తెలిపారు. ఈ కేసు, సమాజంలో మహిళల గురించి ఆమె మాట్లాడుతూ... ''ఇటువంటి సమస్యలు కేవలం హీరోయిన్లకు మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా ఎంతో మంది సాధారణ మహిళలు, అమ్మాయిలకు ఎదురు అవుతున్నాయి. ఏఐ (AI)లో ఎన్నో పాజిటివ్ విషయాలు ఉన్నాయి. వాటిని వదిలేసి ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, ఎదుటి వ్యక్తిని క్షోభకు గురి చేయడానికి దుర్వినియోగం చేయడం సరికాదు. ప్రేక్షకులు, ప్రజలు ఇటువంటి ఫేక్ కంటెంట్‌ను షేర్ చేయడం గానీ, ఎంకరేజ్ చేయడం గానీ చేయవద్దు'' అని తెలిపారు.
బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన రుక్మిణీ వసంత్‌ను డీప్ ఫేక్ వీడియో గురించి స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా... తాను చెప్పాలని అనుకున్నది సోషల్ మీడియాలో చెప్పానని తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఆల్రెడీ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన డీప్ ఫేక్ బికినీ వీడియో తన ప్రైవసీని దెబ్బ తీయడమే కాకుండా... తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూస్తే... నిజంగా రుక్మిణీ వసంత్ టూ పీస్ బికినీ ధరించినట్టు అనిపిస్తుంది. గ్రీన్ కలర్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటో షూట్ చేస్తున్నట్లు ఉంది. అది చూసి చాలా మంది నెటిజన్లు రుక్మిణీ వసంత్ ఒరిజినల్ వీడియో అనుకుని పొరబడ్డారు. అయితే... అది ఫేక్ వీడియో అని, వాటితో తనకు సంబంధం లేదని రుక్మిణీ వసంత్ క్లారిటీ చేశారు.
Rukmini Vasanth Upcoming Movies: రుక్మిణీ వసంత్ కెరీర్ విషయానికి వస్తే... రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1'తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. అందులో యువరాణిలా నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు. అంతకు ముందు రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్'లోనూ కథానాయికగా నటిస్తున్నారు.
