రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  ఉన్నాయి. ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) వాటిని మరింత పెంచారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన 'పెద్ది కీ ఆవాజ్' (Peddi Ki Aawaz)లో రామ్ చరణ్ నటనపై రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకు రివ్యూ (Peddi Review) ఇవ్వమని అడగ్గా... ఆయన ఏం చెప్పారంటే?  

Continues below advertisement

ప్రతి ఫ్రేమ్‌లోనూ చరణ్ కష్టం కనిపిస్తుంది'పెద్ది' సినిమా కోసం, ఆ పాత్రలో నటన కోసం రామ్ చరణ్ పడిన కష్టం, చూపించిన అంకితభావం అమోఘమని ఏఆర్ రెహమాన్ చెప్పారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో ఆయన నటన అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు.

రామ్ చరణ్ డ్యాన్స్ గురించి రెహమాన్ మాట్లాడారు. ''నా పాటలకు రామ్ చరణ్ డ్యాన్స్, ఆ ఎనర్జీ కొత్త అర్థాన్ని ఇచ్చాయి. ఓ హీరో పాటలోని ప్రతి మూమెంట్‌ను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నప్పుడే ఆ సంగీతానికి పూర్తి ప్రాణం వస్తుంది. రామ్ చరణ్ విషయంలో అది అక్షరాలా నిజమైంది. తన డ్యాన్స్ వల్ల సాంగ్స్ మరింత హిట్ అయ్యాయి" అని రెహమాన్ చెప్పారు. 'పెద్ది'గా రామ్ చరణ్ నటన తెలుగుతో పాటు మిగతా భాషల ప్రేక్షకులనూ కట్టి పడేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భోపాల్ ఈవెంట్ స్పెషాలిటీ ఏమిటంటే... 'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' పాటకు రెహమాన్ స్వయంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

Continues below advertisement

Also ReadDrishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'

దర్శకుడు బుచ్చిబాబు సానా మేకింగ్ స్టైల్, హీరోయిన్ జాన్వీ కపూర్ నటనను కూడా ఏఆర్ రెహమాన్ మెచ్చుకున్నారు. అంతే కాదు... మెగా ఫ్యాన్స్, 'పెద్ది' సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు రెహమాన్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమాలో మరికొన్ని పాటలు ఉన్నాయని చెప్పారు. కథలో భాగంగా కొన్ని పాటలు వచ్చాయని, నేపథ్యంలో అవి వినిపిస్తాయని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన తెలిపారు.

Also ReadAnsiba Hassan - Jihadi Remark Controversy: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి వస్తోంది. జూన్ 3న అమెరికాలో ప్రీమియర్లు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేశారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, రవి కిషన్, దివ్యేందు శర్మ తదితరులు సినిమాలో నటించారు. 

Also ReadRam Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు