Ansiba Hassan vs Tiny Tom - Jihadi Remark Controversy: 'దృశ్యం 3' చూశారా? మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పెద్ద కుమార్తె అంజు పాత్రలో నటించిన అమ్మాయే... పైన ఫోటోలో ఉన్నది. ఆమె పేరు అన్సిబా హసన్ (Ansiba Hassan). సినిమా విజయం కంటే సంచలన వార్తతో ఆమె పేరు మలయాళ చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతోంది. జిహాదీ అంటూ తనను తోటి నటుడు కామెంట్ చేశారని ఆమె ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
జిహాదీ అన్నాడు... మతపరమైన కామెంట్స్ చేశారు!అన్సిబా హసన్ ముస్లిం అమ్మాయి. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'దృశ్యం 3'తో వచ్చిందీ నటి. ఇక ఆమె మతం గురించి తెలుగు ప్రజలకు తెలిసే అవకాశం తక్కువ. అన్సిబా మతం ప్రస్తావన ఎందుకంటే...
నటుడు టినీ టామ్ (Tiny Tom) మీద ఆవిడ మండిపడ్డారు. తనను 'జిహాదీ' అని టినీ టామ్ కామెంట్ చేశాడని ఆరోపించారు. ఇస్లామిక్ తీవ్రవాదులు లేదా మిలిటెంట్లను జిహాదీలు అంటున్న సంగతి తెలిసిందే. దాంతో ఒక్కసారిగా మలయాళ చిత్రసీమలో వాతావరణం వేడెక్కింది. టినీ టామ్ వర్సెస్ అన్సిబా హాసన్... ఇద్దరి మధ్య మతపరమైన, వ్యక్తిగత ఆరోపణలు - వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
అన్సిబా వర్సెస్ టినీ టామ్ గొడవ ఏంటి?అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)లో జాయింట్ సెక్రటరీగా పని చేశారు అన్సిబా హాసన్. ఫిబ్రవరి, 2026న ఆ పదవికి రాజీనామా చేశారు. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అప్పట్లో తెలిపారు. అయితే... ఇప్పుడు 'అమ్మ' జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడానికి ఆ సంస్థలో ఎదుర్కొన్న నిరంతర వేధింపులేనని వెల్లడించారు.
Also Read: Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు
కో యాక్టర్ డ్రైవర్‌ను బలవంతపు మత మార్పిడి చేశానని 'అమ్మ'లో తనపై తప్పుడు ప్రచారాలు జరిగాయని అన్సిబా హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, 'అమ్మ' ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఒకరు ఉద్దేశపూర్వకంగా తన మీద పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని, అందువల్ల తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యానని అన్సిబా హాసన్ పేర్కొన్నారు. ఆ ఘటనల్లో తనకు 'అమ్మ' నుంచి ఎటువంటి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి సభ్యుల్లో తనపై చెడు అభిప్రాయం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారామె.
అన్సిబా హాసన్ చేసిన ఆరోపణలపై టినీ టామ్ స్పందించారు. గతంలో ఆవిడ ఎప్పుడూ ఈ విషయాలు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేసిన సమయంలోనూ వృత్తిపరమైన కారణాలు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మలయాళ చిత్రసీమలో నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, రియాలిటీ షో జడ్జిగా టినీ టామ్ గుర్తింపు పొందారు. అయితే... ఇప్పుడు అన్సిబా హాసన్ చేసిన ఆరోపణలు మలయాళ సినిమా ఇండస్ట్రీలో కుల, మతపరమైన వివక్ష ఉందని పెద్ద చర్చకు దారితీశాయి. అక్కడ గొడవలు బయట పడుతున్నాయి.
