Professor Nageshwar | అమరావతి: ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్, కేసులపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గత కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నవారినైనా, ప్రతిపక్షంలో ఉన్నవారినైనా ప్రశ్నిస్తూనే ఉన్నారని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి, కేవలం ఒకే ఒక్క లైన్‌ను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, కేసులతో బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెబితే ట్రోల్ చేయడంతో పాటు కేసులు పెట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించడం, ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. 

Continues below advertisement

రాజకీయ గుండాయిజంపై ప్రకాష్ రాజ్ విమర్శలు ‘మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను’ అనడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని, ఇది కేవలం రాజకీయ గుండాయిజం అని నటుడు ప్రకాష్ రాజ్ జన సైనికులు, పవన్ ఫ్యాన్స్‌ను విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉందని అనిపిస్తే, దానికి ఆధారాలు అడగాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అవమానించడం కొత్త రాజకీయ సంస్కృతిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు

Continues below advertisement

నిష్పాక్షిక విశ్లేషణలు గుర్తురాలేదా.. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బిజెపి వంటి అన్ని రాజకీయ శక్తులను ప్రశ్నించారని, అప్పుడు ఆయన నిజాయితీ ఎవరికీ గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం ఒక మాట నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని మండిపడ్డారు.

Also Read: Purandeswari Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి పురందేశ్వరి? మోదీ టీంలో 'చిన్నమ్మ'కు కీలక పదవి ఖరారైందా?

ప్రజాస్వామ్యానికి హెచ్చరిక ప్రశ్నించే గొంతులను కేసులతో నోరు మూయించాలని చూడటం అత్యంత ప్రమాదకరమని, ఈరోజు నాగేశ్వరరావుకు తలెత్తిన పరిస్థితి రేపు ఇంకెవరికైనా ఎదురుకావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి అనాగరిక చర్యలను ఆపాలని ప్రకాష్ రాజ్ కోరారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మేము  అండగా ఉన్నాం, మీరు మీ పనిని యథాతథంగా కొనసాగించండి అంటూ ప్రకాష్ రాజ్ తన సంఘీభావాన్ని తెలిపారు. 

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన ఫైర్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి, ప్రస్తుత జనసేన పార్టీకి ఉన్న పోలికలను విశ్లేషించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైఖరి, గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్రను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయాలను తక్కువ చేసి చూపేలా ఉన్నాయంటూ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమిత్ షాను కలిసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లకు క్లాస్ పీకారని.. చంద్రబాబు ఇన్ స్టాంట్ ఫ్రెండ్, జగన్ శాశ్వత మిత్రుడు అని చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

Also Read: SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!

ఈ వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను సామాజిక మాధ్యమాలలో లక్ష్యంగా చేసుకున్నారు . ఆయన విశ్లేషణలు ఒక వర్గానికి కొమ్ముకాసేలా, పక్షపాత ధోరణితో ఉన్నాయని వారు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని, ఆయన త్యాగాలను నాగేశ్వర్ రావు కావాలనే కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పాత వీడియోలను, ట్రోల్స్‌ను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిష్పక్షపాత విశ్లేషకుడిగా కాకుండా, రాజకీయ అజెండాతోనే నాగేశ్వర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న ప్రొఫెసర్ 

పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీకి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం, జనసేన నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమై కేసులు నమోదు కావడంతో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు వెనక్కి తగ్గారు. వైఎస్ జగన్ అరెస్ట్ అంశంపై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించారని, ఆ సమయంలో జగన్ తమకు 'లాంగ్ టర్మ్ ఫ్రెండ్' అని అమిత్ షా అన్నారంటూ జనసేన కోర్ కమిటీ సభ్యుడి సమాచారం మేరకు తాను చేసిన వ్యాఖ్యలను ఆయన భేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, తనను ఎంతగానో గౌరవించే వ్యక్తి అని నాగేశ్వర్ అన్నారు.