సుమారు రూ. 350 కోట్లు ఖర్చుపెట్టి 'పెద్ది' (Peddi) నిర్మించామని, డిస్ట్రిబ్యూటర్స్ vs ఎగ్జిబిటర్స్ ఇష్యూలో తమ సినిమాను బలి చేయవద్దు అంటూ నిర్మాత వెంకట సతీష్ కిలారు (Peddi Producer Venkata Satish Kilaru) చేసిన రిక్వెస్ట్ పని చేయలేదు. ఈ రోజుకూ 'పెద్ది' పంచాయితీ తెగలేదు. 'రెంటల్ సిస్టమ్ వద్దు... పర్సెంటేజ్ మాత్రమే ముద్దు' అంటూ మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

'పెద్ది'కి షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్లు!మెగా హీరోల సినిమాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని... అప్పుడు 'హరిహర వీరమల్లు' విడుదల సమయంలో, ఇప్పుడు 'పెద్ది' విడుదలకు ముందు తమ డిమాండ్స్ నెరవేర్చాలని ఎగ్జిబిటర్లు అల్టిమేటం ఇవ్వడం ఏమిటని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కొందరు వ్యాఖ్యానించారు. 

Also Read: Rukmini Vasanth On Deepfake Bikini Video - బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్‌కు రెడీ

Continues below advertisement

సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ కోరుతూ చేసిన డిమాండ్ మీద తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య మీటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత 'పెద్ది' విడుదల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ దిల్ రాజు మీడియాకు తెలిపారు. మర్నాడు 'పెద్ది' విడుదలకు ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతిలో వెళతామని ఫిల్మ్ ఛాంబర్ నుంచి లెటర్ రాగా... ఆ తర్వాత తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. దాంతో లుకలుకలు బయటపడ్డాయి. ఇప్పుడు మరోసారి ఎగ్జిబిటర్లు తమ వైఖరి స్పష్టం చేశారు.

Also ReadPeddi Bhopal Event - భోపాల్‌లో ఇవాళే 'పెద్ది' ఈవెంట్... 150 కోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో రెహమాన్ పెర్ఫార్మన్స్  నుంచి Hellallallo సాంగ్ లాంచ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసా?

ఏపీలో 'పెద్ది' సినిమాకు టికెట్ రేట్లు పెంచినా తాము పెంచబోయేది లేదని ఈ రోజు (మే 23, ఆదివారం) తెలంగాణ ఎగ్జిబిటర్లు కొంత మంది ప్రెస్ మీట్ నిర్వహించారు. టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకుల మీద భారం వేయవద్దని కోరారు. అంతే కాదు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ''అప్పుడు 'హరిహర వీరమల్లు' సమయంలో ఈ మాట చెబితే ఇబ్బంది అన్నారని వెనక్కి తగ్గాం. ఇప్పుడు మూడు వారాల సమయం కోరుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు 'పెద్ది' సినిమా నుంచి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి'' అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నుంచి విజయేందర్ చెప్పారు. పెద్ది సినిమా అయినా, ఏ సినిమా అయినా సరే తమది ఒకటే నిర్ణయం అని మరొకరు అన్నారు. ఇప్పుడు 'పెద్ది' సినిమా నిర్మాత ఏం చేస్తారో చూడాలి. ఓ విధంగా ఆయన్ను టెన్షన్ పెట్టే వ్యవహారమే ఇది.

Also ReadUgly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?