రెంటల్ సిస్టమ్ వద్దు అని తమకు పర్సంటేజ్ ముద్దు అంటూ ఎగ్జిబిటర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం జీవో జారీ చేసినా తాము ఒప్పుకోమని తెగేసి చెప్పారు. సింగిల్ స్క్రీన్లలో సౌకర్యాలు పెంచి తర్వాత మాట్లాడాలని, శిరీష్ మినహా మిగతా వాళ్లకు ఆ హక్కు లేదంటూ చిత్ర నిర్మాతలు చెప్పారు. అది కాస్త ఏషియన్ సునీల్ వర్సెస్ నాగవంశీ అన్నట్టు మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు (ఎగ్జిబిటర్స్) వర్సెస్ ప్రొడ్యూసర్స్ ఇష్యూలో రామ్ చరణ్ 'పెద్ది' విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. వాటికి 'దిల్' రాజు తెర దించారు.

Continues below advertisement

'పెద్ది' విడుదల విషయంలో సందేహాలు అక్కర్లేదు!మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన కలయికలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా 'పెద్ది' (Peddi). ఆ సినిమా విడుదలకు ముందు తమ సమస్యలు పరిష్కరించాలని ఎగ్జిబిటర్లు అల్టిమేటమ్ జారీ చేశారు. గతంలో 'హరిహర వీరమల్లు', ఇప్పుడు 'పెద్ది'... మెగా హీరోల సినిమాల ముందు సమస్యల పేరుతో టార్గెట్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. 'పెద్ది'కి పెద్ద దెబ్బ పడుతుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు భావించారు. ఆ సందేహాలకు 'దిల్' రాజు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 

'పెద్ది' విడుదలపై తెలుగు చిత్రసీమలో నెలకొన్న అనిశ్చితికి ప్రముఖ నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ - ఎగ్జిబిటర్ 'దిల్' రాజు తెర దించారు. జూన్ 4వ తేదీన అత్యంత సానుకూలమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో రామ్ చరణ్ సినిమా విడుదల అవుతుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ సమస్యకు పరిష్కారం లభించింది. 'దిల్' రాజు మాట్లాడుతూ... ''ఎగ్జిబిటర్లు కోరిన విషయంపై నిర్మాతలు సానుకూలంగా ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రేయస్సు దృష్ట్యా అందరూ కలిసి ముందుకు సాగుతాం'' అని చెప్పారు.

Continues below advertisement

మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఉన్నట్లే సింగిల్ స్క్రీన్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌కు ఒప్పుకోని, అంగీకరించని సినిమాలను ప్రదర్శించబోమని ప్రకటించారు. 'పెద్ది'ని లక్ష్యంగా చేసుకుని అటువంటి డిమాండ్ చేయడం, రూల్ పెట్టడం సరికాదని నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో సురేశ్ బాబు, దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతల ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి.

Also Read: Veerabhadrudu Movie Review - 'వీరభద్రుడు' రివ్యూ: క్షేత్రపాలకుడిగా సూర్య తాండవం... సినిమా ఎలా ఉందంటే?

తెలుగు చిత్రసీమలో థియేటర్ల సమస్యలను లోతుగా అధ్యయనం చేసేందుకు, పరిష్కారం కోసం 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాబోయే రెండు నెలల్లో ఏ, బీ, సీ సెంటర్లలో థియేటర్ల పరిస్థితిని బట్టి ఎటువంటి పర్సంటేజీలు అమలు చేయాలనేది నిర్ణయిస్తూ నివేదికను ఆ కమిటీ ఇస్తుంది. 

Photo Gallery: Sai Pallavi Latest Pics - ఆ ఫ్లాప్ తర్వాత ఇన్‌స్టాలో సాయి పల్లవి ఫస్ట్ పోస్ట్... లేడీ పవర్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు

Peddi Movie Cast: రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన 'పెద్ది' సినిమాలో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, లెజెండరీ నటుడు జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేశారు. మే 18న 'పెద్ది' ట్రైలర్ విడుదల కానుంది. థియేటర్లలో జూన్ 4న సినిమా విడుదల కానుంది.

Also Read: Bandi Saroj Kumar On Bandi Bhagirath - అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్