టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధినేత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 20న ఆయన వివాహం అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, కల్యాణ్ తో మూడు ముళ్లు వేయించుకునే అమ్మాయి ఎవరు? వీరిద్దరి వివాహం ఎక్కడ జరుగుతుంది? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు.


సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ‘అధీర’


ఇక ప్రస్తుతం కల్యాణ్ హీరోగా ‘అధీర’ అనే సినమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు గౌరీ హరి సంగీతాన్ని అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల అయ్యింది. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఈ గ్లింప్స్ ఆవిష్కరించారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోంది.‘అధీర’ పేరుతో విడుదలైన వీడియో ఇప్పటకే బాగా అలరిస్తోంది.  ఈ సినిమా అద్భుతమైన విజువల్ వండర్ గా రూపొందబోతున్నట్లు ఈ విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ ఇందులో చూపించారు.


Read Also: పదిహేను కోట్లు ఖర్చు పెట్టి రివేంజ్ తీర్చుకోవాలా? ‘మళ్ళీ పెళ్లి’పై నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్






విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ


విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ దిట్ట. ‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ’ లాంటి సరికొత్త కథాంశాలతో అదిరిపోయే సినిమాలను తెరకెక్కించారు. తేజ సజ్జ హీరోగా ‘హనుమాన్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు. ఇక  కల్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ‘అధీర’ మూవీ కూడా సూపర్ హీరో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందడం విశేషం.   


పవన్ కల్యాణ్ హీరోగా ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య


ఇక ‘RRR’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత ప్రస్తుతం దానయ్య పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘ఓజీ’ మూవీకి సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే ముంబైలో కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ పుణెలోని ప్రకృతి అందాల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలోని పాటల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘ఓజీ’ తొలి షెడ్యూల్ కాగానే, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనాలి. కానీ, అనుకోకుండా ‘ఓజీ’ రెండో షెడ్యూల్ కు పవన్ ఓకే చెప్పడంతో షూటింగ్ కొనసాగుతోంది.  


Also Read నేను ఏ తప్పూ చేయలేదు, క్లారిటీ ఎందుకు? - నాగ చైతన్యతో డేటింగ్‌పై శోభితా ధూళిపాళ