'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదలకు కొన్ని గంటల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ ఓ కానుక ఇచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 


'ఉస్తాద్'గా పవన్ లుక్ చూశారా?
పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఓ సగటు పవర్ స్టార్ ఫ్యాన్ స్క్రీన్ మీద తమ అభిమాన హీరోను ఎలా చూడాలని కోరుకుంటున్నారో? ఆ విధంగా 'గబ్బర్ సింగ్'లో చూపించి భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నారు. 






Pawan Kalyan First Look In Ustaad Bhagat singh : 'గబ్బర్ సింగ్' సినిమా విడుదలై నేటికి 11 ఏళ్ళు. అందుకని, ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదల చేయనున్నారు. అంత కంటే ముందు సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిజం చెప్పాలంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఓ లుక్ విడుదల చేశారు. అయితే, అది కాన్సెప్ట్ లుక్! అందుకని, దీనిని ఫస్ట్ లుక్ అనుకోవాలి. ఈ మాస్ లుక్ పవన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 


Also Read శకుంతలే కాదు, సమంత 'శాకుంతలం' కూడా అనాథే



సోనీ చేతికి 'ఉస్తాద్...' ఆడియో!
'ఉస్తాద్ భగత్ సింగ్' ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ ప్రముఖ కంపెనీ సోనీ సొంతం చేసుకుంది. సోనీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సినిమా పాటలను ప్రేక్షకులు వినొచ్చు. అదీ విడుదలైన తర్వాతే అనుకోండి!


'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లింప్స్ అదిరిపోతుందని ఆల్రెడీ డీఎస్పీ అప్డేట్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 


Also Read చేతకాని వాళ్ళు అదుపు తప్పారు, తిడితే వాళ్ళ నోరే కంపు అవుతుంది - అనసూయ ఫైర్


'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఓ కథానాయికగా శ్రీ లీల నటిస్తున్నారు. మరో కథానాయికకు కూడా సినిమాలో చోటు ఉందని సమాచారం. ఇంకా ఆ పాత్రకు ఎవరినీ ఎంపిక చేయలేదని తెలిసింది. త్వరలో ఎంపిక చేస్తారట. ఆ మధ్య హైదరాబాదులో ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. అందులో కథానాయిక శ్రీలీల (Sreeleela) కూడా పాల్గొన్నారు. హీరో హీరోయిన్లతో కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ తెరకెక్కించారు. ఆ తర్వాత హరీష్ శంకర్ డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ (Ram Laxman Masters) నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసినట్లు 'ఉస్తాద్ భగత్ సింగ్' యూనిట్ తెలియజేసింది. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీన్లు తీశారు. అవి సినిమాలో హైలైట్ అవుతాయట!