Anasuya Vs Vijay Deverakonda Fans : విజయ్ దేరవకొండ అభిమానులు, అనసూయ మధ్య వార్ ముదురుతోంది. ‘ఖుషీ’ పోస్టర్ రిలీజ్ తర్వాత మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ అభిమానులపై అనసూయ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “నువ్వు నన్ను తిడితే, నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనేలా తప్పవుతాను? అంటూ నేరుగా విజయ్ దేవరకొండనే టార్గెట్ చేశారు. “నా పెంపకం గర్వించదగినది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా, గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధంచేసుకోండి” అంటూ విమర్శలు చేశారు.  






చేతగాని వాళ్లు అదుపు తప్పారు- అనసూయ


అటు మీడియాలో వస్తున్న కథనాలపైనా అ ఘాటుగా స్పందించారు. “సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయను ఏడిపించారు. వెంటబడ్డారు. ట్రోల్ చేశారు. ఇది కాదు. మీకు ఇంకా దునియా దారి తెలియదు అని చెప్తున్నాను. మీకు క్లారిటీ ఇస్తున్నాను. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. అన్నవారి నోరే కంపు. మీకు ధైర్యం ఉంటే, ఉప్పు, కారం తిని ఉంటే నిజం రాయండి. నేను ధైర్యంగా నా అభిప్రాయాలు చెప్పాను. చేతగాని వాళ్లు అదుపు తప్పారు. ఇదీ మీరు రాయాల్సిన థంబ్ నెయిల్. ఓకే, బెటర్ లక్ నెక్ట్స్ టైమ్” అని చెప్పుకొచ్చారు.  



తాజా వివాదానికి అసలు కారణం ఏంటంటే?


విజయ్ దేవరకొండ హీరోగా ‘ఖుషీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ విడుదల అయ్యింది. ఆ పోస్టర్ మీద ‘The Vijay Devarakonda’ అని వేశారు. ఈ విషయంపై అనసూయ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’నా?? బాబోయ్, పైత్యం, ఏం చేస్తాం?  అంటకుండా చూసుకుందాం’’ అని ట్వీట్ చేసింది. తను ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసింది చెప్పకపోయినా,  'The' అనే పదాన్ని విజయ్ దేవరకొండను ఉద్దేశించే అన్నారంటూ ఆయన అభిమానులు అనసూయను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తీవ్ర పదజాలంతో ఆమెపై విరుచుకుపడుతున్నారు.


కూల్ గా సమాధానాలు చెప్తున్న అనసూయ


విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ట్రోలింగ్ పై అనసూయ కూల్ గా స్పందిస్తున్నారు. ‘‘అంటే ఇంతమంది వత్తాసు పలికితే  గానీ పనవ్వదన్నమాట. ‘అతడు’ సినిమాలో బుజ్జిని పార్థు అడిగినట్లు. ‘‘అదే ఇంతమందేంటి అని.. నా ఒక్కదాని కోసం. ఏమో బాబు.. నాకే పీఆర్ స్టంట్లు తెలీవు, రావు, అవసరం లేదు కూడా. కానీయండి, కానీయండి’’ అని ట్వీట్ చేసింది. కాసేపటి తర్వాత “ఒక్కడి కొట్టడం కోసం ఇంత మందా?” అనే ‘అతడు’ డైలాగ్ వీడియోను షేర్ చేస్తూ సటైర్లు విసిరింది.


‘అర్జున్ రెడ్డి’ నుంచే అనసూయ, విజయ్ మధ్య కోల్డ్ వార్


వాస్తవానికి అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయం నుంచే మొదలయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘ ఏం మాట్లాడుతున్నవ్ రా మాదర్..” అని విజయ్ చెప్పడంపై అనసూయ తీవ్ర విమర్శలు చేసింది. అదే సమయంలో విజయ్ ఫ్యాన్స్ అనసూయను టార్గెట్ చేశారు. ఆ తర్వాత ‘లైగర్’ సమయంలో అనసూయ మరోసారి విమర్శలు చేసింది. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత స్పందించిన అనసూయ “అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ, కొన్నిసార్లు రావడం లేటు కావొచ్చు. కానీ, రావడం పక్కా!” అంటూ విజయ్ ని ట్రోల్ చేసింది. తాజాగా ‘ఖుషీ’ తొల్లి మొదలయ్యింది. ఈ పంచాయితీ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.


Read Also: నా యాక్టింగ్ నాకే నచ్చదు, ఏ సినిమా చూసినా ఇలా చేశానేంటి అనిపిస్తుంది: నాగ చైతన్య