మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (Jr NTR Birthday) కానుక రెడీ! ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా (NTR 30 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బర్త్ డేకు ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


మే 20న ఎన్టీఆర్ 30 టైటిల్!
'వస్తున్నా' అంటూ కాన్సెప్ట్ టీజర్‌లోని చివరగా చెప్పే ఒక్క డైలాగుతో సినిమాపై అంచనాలు పెంచారు. పైగా, 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రమిది. అందుకని, సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మీద క్యూరియాసిటీ నెలకొంది. దానికి ఈ నెల (మే) 20న తారక్ పుట్టినరోజు నాడు తెరపడనుంది.


NTR 30 First Look Title : మే 20న టైటిల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారని తెలిసింది. ఒక్క రోజు ముందు ఫస్ట్ లుక్ రావచ్చు. పాన్ ఇండియా సినిమా కనుక... అన్ని భాషలకు సూటయ్యేలా లుక్, టైటిల్ ఫిక్స్ చేశారు. 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అప్పట్లో కాదని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం... అదే టైటిల్ ఫిక్స్ చేశారట.


Also Read : విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్ కాపీనా? ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్



ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. 


ఎన్టీఆర్ అంటే యాక్షన్! సాధారణ యాక్షన్ సన్నివేశాన్ని సైతం తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళతారు. ఇక, పవర్ ఫుల్ యాక్షన్ సీన్ అయితే ఆయన చెలరేగిపోతారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం ధీటైన యాక్షన్ ప్లాన్ చేశారట.


Also Read ప్రేమలో ప్రభాస్ - అనుష్క తప్ప ఎవరూ సెట్ అవ్వరా? 'ఆదిపురుష్' ట్రైలర్ మీమ్స్ చూశారా


''పవర్ ఫుల్ యాక్షన్ తో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. బ్రదర్ ఎన్టీఆర్ స్టైల్ అండ్ యాక్షన్ అద్భుతం'' అని కొన్ని రోజుల క్రితం రత్నవేలు పేర్కొన్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఎన్టీఆర్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... రెండో షెడ్యూల్ చేశారు. 


ఎన్టీఆర్ 30లో సీరియల్ స్టార్ చైత్ర రాయ్!
Chaithara Rai In NTR 30 : ఇన్నాళ్లూ బుల్లితెరపై 'అష్టా చమ్మా', 'దటీజ్ మహాలక్ష్మి', 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు' సీరియళ్లతో సందడి చేసిన చైత్ర రాయ్, ఇప్పుడు వెండితెర అవకాశాన్ని అందుకున్నారు. అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్నారు. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్ర పోషించే అవకాశం అందుకున్నారు.