ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నారా? 'లేదు' అని ఆ హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పేశారు. హిందీ హీరో వరుణ్ ధావన్ బాలీవుడ్ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు, అయోధ్యలో 'ఆదిపురుష్' టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రభాస్, కృతి మధ్య కెమిస్ట్రీ చూసి చాలా మంది నిజంగా ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. అటువంటి ఏమీ లేదని వాళ్లిద్దరూ చెప్పిన తర్వాత పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
'ఆదిపురుష్' ట్రైలర్ విడుదలైన తర్వాత మరోసారి ప్రభాస్, కృతి సనన్ ప్రేమ పుకార్లు మరోసారి మొదలు అయ్యాయి. ముంబైలో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని కొందరు ఫోటోలు తీసి మరీ మీమ్స్ చేస్తున్నారు.
ప్రభాస్, అనుష్క జోడీ ఎలా?
వెండితెరపై ప్రభాస్, అనుష్కది హిట్ జోడీ! నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, వాళ్ళు ప్రేమలో ఉన్నారని భావిస్తున్న జనాలు కూడా ఉన్నారనుకోండి! ప్రభాస్, కృతి ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చినప్పుడు అనుష్క సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు కూడా చేశారు. మీమ్స్, ట్రోల్స్ పక్కన పెడితే... ప్రభాస్, అనుష్క జోడీని మరోసారి వెండితెరపై చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.
Also Read : బన్నీతో ఫోటో మాత్రమే, 'పుష్ప 2'లో సీరత్ ఐటమ్ సాంగ్ లేదు!
'ఆదిపురుష్'లో సీత పాత్రకు కృతి సనన్ బదులు అనుష్క అయితే బావుంటుందని కొందరి ఫీలింగ్! దానిని మీమ్ రూపంలో వ్యక్తం చేశారు. సీతగా అనుష్కను ఎడిట్ చేసి పెట్టారు.
'ఆదిపురుష్' కథ లీక్ అయిందిగా!?
Adipurush Story Leaked : రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' రూపొందుతోంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే, స్టోరీ లీక్ అయ్యిందని ఓ మీమ్ రావడం విశేషం.
సారీ ఓం... కోపంలో తిట్టేశాం!
'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత దర్శకుడు ఓం రౌత్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ విరుచుకుపడ్డారు. ఆయన్ను తిట్టినవాళ్ల సంఖ్య తక్కువేం లేదు. ఆ ఫ్యాన్స్ అందరూ ట్రైలర్ చూసిన తర్వాత హ్యాపీగా ఫీలవుతున్నారు. ''సారీ ఓం... కోపంలో ఏదో తిట్టేశాం! ఏమీ అనుకోవద్దు'' అంటూ పోస్టులు చేస్తున్నారు.
Also Read : 'కస్టడీ'లో ఆ బూతుకు కత్తెర - సెన్సార్ రిపోర్ట్, రివ్యూ ఎలా ఉందంటే?
గమనిక : సోషల్ మీడియాలో కొందరు చేసిన మీమ్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఆ మీమ్స్ లేదా మీమ్స్ చేసిన వ్యక్తులకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరు.
'ఆదిపురుష్'లో శ్రీరామచంద్రుని పాత్రలో ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. రామదూత హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.