Custody Censor Report : 'కస్టడీ'లో ఆ బూతుకు కత్తెర - సెన్సార్ రిపోర్ట్, రివ్యూ ఎలా ఉందంటే?

Custody movie First Review : నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన 'కస్టడీ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క బూతుకు కత్తెర పడింది. దాంతో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.

Continues below advertisement

అక్కినేని హీరోలకు ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూసేలా వాళ్ళ సినిమాలు ఉంటాయి. నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) తాజా సినిమా 'కస్టడీ'కి కూడా అందరూ వెళ్లవచ్చని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందంటే... 

Continues below advertisement

ఆ ఒక్క బూతుకు కత్తెర
Custody movie censor report : 'కస్టడీ'కి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అంటే పన్నెండేళ్ల వయసులోపు పిల్లలను తమతో పాటు థియేటర్లకు పెద్దలు తీసుకు వెళ్ళవచ్చు. సినిమాలో అభ్యంతరకరమైన డైలాగులూ లేవు. ఒక్కటంటే ఒక్క మాటకు కత్తెర పడింది. 'ల.......క' మాటను తొలగించమని, సబ్ టైటిల్స్ వేసేటప్పుడు కూడా తీసేయమని చిత్ర బృందాన్ని సెన్సార్ బోర్డు ఆదేశించింది. అదీ సంగతి!

'కస్టడీ' టాక్ ఎలా ఉందంటే?
Custody movie first review Telugu : 'కస్టడీ' చూసిన జనాలు చెప్పేది ఏంటంటే... వెంకట్ ప్రభు స్టయిల్‌ (Venkat Prabhu)లో, ఆయన స్టయిల్ ఆఫ్ టిపికల్ స్క్రీన్ ప్లేతో సినిమా  సాగుతుందని చెబుతున్నారు. నాగ చైతన్య ఇంటెన్స్ యాక్టింగ్ బావుందని చెబుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ 'ధృవ'లో స్టయిలిష్ విలన్ రోల్ చేసిన అరవింద్ స్వామి... 'కస్టడీ'లో మరోసారి విలనిజాన్ని చూపించారు. ఈసారి ఆయన యాక్టింగ్ మాసీగా ఉండబోతుందని టాక్. 

సినిమా స్టార్టింగులో కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళినప్పటికీ... ఇంటర్వెల్ ముందు నుంచి స్పీడ్ అందుకుంటుందని టాక్. ఒక్కసారి వెంకట్ ప్రభు స్టైల్ రేసీ స్క్రీన్ ప్లే మొదలైన తర్వాత ప్రేక్షకుడి చూపులు పక్కకి వెళ్లవని అంటున్నారు. క్లైమాక్స్ హైలైట్ అవుతుందట. 

కథేంటో చెప్పేసిన 'కస్టడీ' టీమ్
ఇప్పుడు స్పాయిలర్స్ కంట్రోల్ చేయడం ఎవరికి అయినా సరే పెద్ద పని. ఫస్ట్ షో కంప్లీట్ అయ్యాక... కథ ఏంటనేది నెట్టింట్లోకి వచ్చేస్తుంది. 'కస్టడీ' చిత్ర బృందానికి అటువంటి టెన్షన్ లేదు. ఆల్రెడీ కథ ఏంటనేది చెప్పేశారు. విలన్ చావకుండా, అతడిని కాపాడాలని హీరో అనుకోవడమే సినిమా థీమ్! ఎందుకు కాపాడుతున్నాడు? కాపాడటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. అక్కినేని అభిమానులను 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదని ఆల్రెడీ నాగ చైతన్య హామీ ఇచ్చారు. సో, ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.   

Also Read : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?

తెలుగు, తమిళ భాషల్లో 12న విడుదల!
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.  

Also Read : బోల్డ్ కపుల్ నరేష్, పవిత్ర కథ మరింత తెలుసుకోవాలని ఉందా?

Continues below advertisement