సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఒక రేంజ్! అందులోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఆయన తీసే సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ వెరీ వెరీ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. మరి, 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ ప్లానింగ్ ఎలా ఉంది? సుక్కు ఏం చేయబోతున్నారు? ఆ సాంగులో ఎవరు యాక్ట్ చేస్తారు? అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'పుష్ప 2' ఐటమ్ గాళ్ కింద కొత్త పేరు వినిపిస్తోంది.
 
'పుష్ప 2'లో సీరత్ కపూర్ ఐటమ్ సాంగ్!?
హీరోయిన్ సీరత్ కపూర్ (Seerat Kapoor) గుర్తు ఉన్నారా? శర్వానంద్ 'రన్ రాజా రన్', రవితేజ 'టచ్ చేసి చూడు', సిద్ధూ జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాథ వినుమ' సినిమాల్లో నటించారు. 'పుష్ప 2' సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందించారు కూడా!


బన్నీతో జస్ట్ ఫోటో తీసుకున్నానంతే!
'పుష్ప 2'లో సీరత్ కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తున్నారని వార్తలు రావడానికి కారణం ఓ ఫోటో! బన్నీతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ ఆమెకు వచ్చిందని, షూటింగ్ ఫినిష్ అయ్యాక సెల్ఫీ తీసుకున్నారని కొందరు వార్తలు రాసేశారు. అయితే. వాటిలో నిజం లేదని సీరత్ కపూర్ స్పష్టం చేశారు. 


''పుష్ప 2'లో నేను ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా నిరాధారణమైనవి అని క్లారిటీ ఇస్తున్నాను. అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్. ఇటీవల ఆయన్ను కలిశా. కాసేపు మాట్లాడాను. ఓ ఫోటో తీసుకున్నాను. అంతే తప్ప... ఆయన సినిమాలో నేను నటించడం లేదు. అలాగే, నేను ఎటువంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదు'' అని సీరత్ కపూర్ ఇంస్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. అదీ సంగతి! 


Also Read : బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్




'ఆర్య'లో 'ఆ అంటే అమలాపురం...' కావచ్చు, 'ఆర్య 2'లో 'రింగ రింగ...' కావచ్చు! ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక, 'పుష్ప'లో 'ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ' సాంగ్ అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్ స్టెప్స్ వేసేలా చేసింది. అందువల్ల, 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. 


Also Read 'కస్టడీ'లో ఆ బూతుకు కత్తెర - సెన్సార్ రిపోర్ట్, రివ్యూ ఎలా ఉందంటే?



సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి సందడి చేయనున్నారు. ఇంకా సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట రికార్డులు క్రియేట్ చేసింది. ఆ మధ్య మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పాటు సుకుమార్ మీద ఐటీ రైడ్స్ జరగడంతో షూటింగుకు బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పుడు రీ స్టార్ట్ చేశారు.