గత కొంతకాలంగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటు మీడియాలో వీరి గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సమంతతో విడాకుల తర్వాత చై, శోభితతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ డేటింగ్ వార్తల శోభిత ధూళిపాళ తొలిసారి మౌనం వీడింది. తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ హిట్ తర్వాత, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా నాగ చైతన్యతో డేటింగ్ వార్తల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  


చైతో డేటింగ్ పై శోభిత ఏం చెప్పిందంటే?


“ప్రస్తుతం నాకు మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమా చేశాను. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్‌​ రెహమాన్‌ పాటలకు డ్యాన్స్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. జీవితంలో ఎన్నో మంచి అనుభూతులను వదిలేసి ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే తీరికనాకు లేదు. నా గురించి వస్తున్న రూమర్స్ కు నాకు సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పని నేను శ్రద్ధతో చేసుకుంటూ వెళ్తాను” అని వెల్లడించింది. ప్రస్తుతం శోభిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైలర్ అవుతున్నాయి. 


ఇప్పటికే డేటింగ్ వార్తలపై స్పందించిన నాగ చైతన్య


కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య కూడా శోభితతో డేటింగ్ వార్తలపై స్పందించారు. ‘ఏజెంట్’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన, “డేటింగ్ రూమర్స్ గురించి తనకేం తెలియదు” అని వెల్లడించారు.


లండన్ లో కెమెరాలకు చిక్కిన చైతన్య, శోభిత


కొద్ది వారాల క్రితం లండన్ లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. నాగ చైతన్య ఒక చెఫ్ పక్కన పోజులిస్తుండగా, శోభిత తన ముఖాన్ని కెమెరాకు కపపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఫోటో వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరి రిలేషన్‌షిప్‌ గురించి బాగా ప్రచారం జరిగింది. గతంలోనూ రెండు మూడు సార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.


Also Read : నో డేటింగ్, నవ్య స్వామితో రిలేషన్షిప్ గురించి రవికృష్ణ ఓపెన్ కామెంట్స్



ఇక ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చై, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో   'కస్టడీ' అనే సినిమాలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు.  శోభిత తాజాగా విడుదలైన మణిరత్నం మూవీ  ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో నటించింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది.   






Read Also: పెళ్లి నుంచి మోహన్ బాబు షూటింగుకు, హనీమూన్ లేదు, ఏవీఎస్ రూమ్‌లో ఫస్ట్ నైట్ – బ్రహ్మాజీ