యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఆ మాటకు వస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేమికులకు, భారతీయ ప్రేక్షకులకూ ఇది శుభవార్తే. ఎందుకంటే... ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఆస్కార్ రేసులో వినబడుతోంది. హాలీవుడ్‌లో పేరొందిన మీడియా సంస్థ వెరైటీ ఆయన పేరును ప్రస్తావించడమే అందుకు కారణం! అసలు వివరాల్లోకి వెళితే...
 
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన దృశ్యకావ్యం 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) లో కొమురం భీం (Komaram Bheem) పాత్రలో ఎన్టీఆర్ నటించారు. భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం ఆయన నటన మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్, ఇంటర్వెల్ సీన్ అద్భుతం. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆయన నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనేది హాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం.


ప్రతి ఏడాది ఆస్కార్స్ ప్రకటించడానికి ముందు ఎవరెవరికి రావచ్చు? అంటూ 'ప్రెడిక్షన్స్' చెప్పడం సహజంగా జరుగుతుండేది. ఉత్తమ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారో చెబుతూ... 'వెరైటీ' ఒక లిస్టు వెల్లడించింది. అందులో పోటీ ఇచ్చే హీరోల జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. అయితే... ఎన్టీఆర్ పేరు టాప్ 40లో లేదు. (NTR In Unranked Possible Contenders - Oscars Award) అయితేనేం? ఆయన పేరు లిస్టులో ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


ఆస్కార్స్ లిస్టులో 'ఆర్ఆర్ఆర్' పేరు వినిపించడం ఇది తొలిసారి కాదు... ఇంతకు ముందు 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో పురస్కారం వచ్చే ఆస్కారం ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. మన దేశం నుంచి ఆస్కార్స్‌కు ఎప్పుడూ సరైన సినిమాలను పంపరని సుతిమెత్తగా విమర్శలు చేసింది. డానీ బోయెల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు? అని సూటిగా ప్రశ్నించింది. 


Also Read : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో


ఇప్పుడు హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' ఒక సెన్సేషన్. అక్కడి ప్రముఖులు, ప్రేక్షకులు, విమర్శలకులను మన సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాజమౌళి పేరుతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురితో సినిమా చేయడానికి హాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రీసెంట్‌గా 'ఆర్ఆర్ఆర్'కు గూగుల్ సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' అని సెర్చ్ చేస్తే... సెర్చ్ బార్ కింద గుర్రం, బైక్ వెళుతూ కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్'కు ఉన్న క్రేజ్ గుర్తించడంతో పాటు ఈ విధంగా చేసే చిత్ర బృందాన్ని గౌరవించింది గూగుల్. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి. 


Also Read : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!