'పెళ్లి సందD'తో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan Meka) హీరోగా పరిచయం అయ్యారు. అయితే... వరుస పెట్టి ఏదో ఒక సినిమా చేయాలనే తొందరలో రోషన్ లేడు. హీరోగా తనకు పేరు తీసుకురావడంతో పాటు ప్రేక్షకులకు నచ్చే కథలు చేయాలని ఆచి‌ తూచి అడగలు వేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు రోషన్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మరొక సినిమా అంగీకరించారని, కథ విషయంలో దర్శక నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్!హిట్ ఫ్రాంచైజీతో శైలేష్ కొలను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. హిట్ ఫస్ట్ కేస్ నుంచి 'హిట్ 3' వరకు ఆ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు విజయాలు సాధించాయి అయితే మధ్యలో వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'సైంధవ్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫ్లాప్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... శైలేష్ కొలను ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని యాక్షన్ థ్రిల్లర్స్. ఇప్పుడు ఆయన జోనర్ చేంజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. వంద కోట్లు కలెక్ట్ చేసిన వయలెంట్ యాక్షన్ ఫిల్మ్ 'హిట్ 3' తర్వాత ఓ ప్రేమ కథ చిత్రం చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఆ కథ రోషన్ దగ్గరకు వచ్చిందని తెలిసింది.

రోషన్ కథానాయకుడిగా శైలేష్ కొలను ప్యూర్ లవ్ స్టోరీ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ప్రస్తుతం హీరోతో దర్శక నిర్మాతలు చర్చలు తుది దశకు వచ్చాయని తెలిసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూస్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Readరాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!

'ఛాంపియన్' చిత్రీకరణలో రోషన్ బిజీఇప్పుడు రోషన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'వృషభ'. అందులో రోషన్ హీరో. ఆయన సరసన బాలీవుడ్ భామ షనయా కపూర్ హీరోయిన్. అది కాకుండా స్వప్న సినిమా పతాకం మీద మరొక సినిమా చేస్తున్నారు. దాని టైటిల్ 'ఛాంపియన్'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ