'ఛత్రపతి శివాజీ మహారాజ్'... ఒక పోరాట యోధుడు, స్వాతంత్ర సమర వీరుడు, ప్రతి భారతీయుడు ఛాతి పైకెత్తి మావాడు అని చెప్పుకొనే మహారాజు. ఆయన జీవితంపై పలువురు దర్శక రచయితలు, హీరోలు సినిమాలు తీశారు. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో శివాజీని వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు శివాజీ జీవితంపై మరో సినిమా రూపొందుతోంది. 


శివాజీ మహారాజుగా రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి (Rishab Shetty)... కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న దర్శకుడు, కథానాయకుడు. 'కాంతార' ముందు వరకు ఆయన గురించి కొంత మంది పాన్ ఇండియా ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 'కాంతార'తో హీరోగా దర్శకుడిగా అందరిని అలరించి ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి... మరొక వైపు ఇతర దర్శకులతో సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


''ఛత్రపతి శివాజీ మహారాజ్... ఇది సినిమా మాత్రమే కాదు, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుని కథ. దీనిని ఎప్పటికీ మరువలేం. సిల్వర్ స్క్రీన్ మీద యాక్షన్ డ్రామా చూసేందుకు రెడీ అవ్వండి'' అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. 






రిషబ్ శెట్టి టైటిల్ పాత్రలో బాలీవుడ్ దర్శక నిర్మాత సందీప్ సింగ్ ఈ రోజు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' (Chhatrapati Shivaji Maharaj) సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా గురించి రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. అంతే కాదు... సినిమాలో తన లుక్ ఎలా ఉంటుందో కూడా ఆయన చూపించారు. జనవరి 21, 2027లో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


Also Read'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?



శివాజీ మహారాజ్ కంటే ముందు హనుమంతునిగా!
Rishab Shetty Upcoming Movies: 'ఛత్రపతి శివాజీ మహారాజ్' కంటే ముందు 'జై హనుమాన్' సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకుల ముందు రానున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సూపర్ హిట్ హనుమాన్ సీక్వెల్ (Hanuman Sequel)లో హనుమంతుని పాత్రలో రిషబ్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 'కాంతార' విజయం తర్వాత రిషబ్ ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా, ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేలా, కథ కథనాలు ఉండేలా చూసుకుంటున్నారు. 'జై హనుమాన్' కంటే ముందు 'కాంతార: ఛాప్టర్ 1' రానుంది.


Also Readపుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?