Rishab Shetty's Kantara Chapter 1 4 Days Box Office Collections: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 4 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరువలో ఉంది. 

Continues below advertisement


ఫస్ట్ 4 రోజుల్లో...


ఫస్ట్ డే ప్రీమియర్లతో కలిపి రూ.88 కోట్లు వసూళ్లు సాధించగా... రెండో రోజు కాస్త నెమ్మదించి రూ.65 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక మూడో రోజు రూ.82 కోట్ల వసూళ్లు సాధించగా... తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లు రాబట్టింది. ఇక ఇండియాలో ఫస్ట్ మూడు రోజుల్లో రూ.195 కోట్లు వసూళ్లు సాధించగా... ఓవర్సీస్‌లో రూ.40 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 'కాంతార చాప్టర్ 1' కలెక్షన్స్ రూ.300 కోట్లకు చేరువైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఇండియాలో ఫస్ట్ డే అన్నీ భాషల్లో కలిపి రూ.61.85 కోట్లు వసూళ్లు సాధించగా... రెండో రోజు రూ.54.4 కోట్లు, మూడో రోజు రూ.55 కోట్లు, నాలుగో రోజు రూ.61.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలోనూ బుకింగ్స్‌లో అదరగొట్టింది. ఇప్పటివరకూ 50 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు మూవీ టీం వెల్లడించింది.


కేజీఎఫ్ 1ను బీట్ చేసిన 'కాంతార చాప్టర్ 1'


నాలుగు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో కన్నడ చిత్రంగా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 1 వసూళ్లను బీట్ చేసింది. 'కాంతార', 'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాత ప్లేస్‌ను కైవసం చేసుకుంది. కాంతార మూవీ రూ.408 కోట్ల వసూళ్లు సాధించగా, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.1,215 కోట్ల వసూళ్లు సాధించింది. 


Also Read: అనసూయ 'అరి' To క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - ఒకే రోజు 3 సినిమాలు... ఈ వారం ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే


ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. ప్రమోద్ శెట్టి, జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. 2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో తనదైన అద్భుతమైన నటనతో రిషబ్ అదరగొట్టారు. పంజుర్లి దేవునితో పాటు అడవిలోని దైవిక భూమి 'కాంతార'లో దైవ గణాల రహస్యాలు, మహిమాన్విత శక్తులను అద్భుతంగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు.


థియేటర్‌లో పంజుర్లి!


వివిధ ప్రాంతాల్లో 'కాంతార చాప్టర్ 1' ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద కొందరు ఆడియన్స్ ఎమోషన్‌కు గురవుతున్నారు. వారు పంజుర్లి, గుళిగ వచ్చినట్లుగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ థియేటర్‌లో పంజుర్లి వేషధారణలో ఓ అభిమాని సందడి చేశారు. తమిళనాడులోని దిండిగల్ థియేటర్లో పంజుర్లి వేషంలో ఫ్యాన్‌ను చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. సినిమా స్టార్ట్ కావడానికే ముందే ఆ వేషంతో సందడి చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది.