Kalyani Priyadarshan's Kotha Lokah OTT Release Date Lokced: మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ సూపర్ ఫాంటసీ థ్రిల్లర్ 'కొత్త లోక' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 28న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే రికార్డులు సృష్టించింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అంటూ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
'కొత్త లోక' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా... ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఆ రోజున తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మూవీ అందుబాటులోకి రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. గతంలోనూ ఓటీటీ రిలీజ్ డేట్‌పై రూమర్స్ రాగా చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పందించారు. 'అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయండి.' అంటూ ట్వీట్ చేశారు.
ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్, 'ప్రేమలు' ఫేం నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటే దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, షాబిన్ షౌహిర్ అతిథి పాత్రల్లో మెరిశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా... తన సొంత నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత నాగవంశీ రిలీజ్ చేశారు.
Also Read: విజయ్ దేవరకొండ చేతికి రింగ్ - రష్మిక మరో పోస్ట్ వైరల్...
రూ.300 కోట్ల క్లబ్‌లోకి...
రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రీసెంట్‌గా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్స్ సాధించింది.
స్టోరీ ఏంటంటే?
హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుంది? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీని తెరకెక్కించారు. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కు సూపర్ పవర్స్ ఉన్న సంగతి కొంత మందికి మాత్రమే తెలుసు. ఓ సాధారణ అమ్మాయిలా బెంగుళూరు వచ్చిన ఆమె రెస్టారెంట్‌లో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. తన పవర్స్ బయట పడనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఆమెకు అద్దెకు దిగిన ఇంటి ఎదురు అపార్ట్‌మెంట్‌లోనే సన్నీ (నస్లెన్) తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు.
తొలి చూపులోనే చంద్రను సన్నీ ఇష్టపడతాడు. ఈ క్రమంలో ఓ పెద్ద ప్రమాదం నుంచి సన్నీని కాపాడుతుంది చంద్ర. దీంతో ఆమెకు మరింత దగ్గరవుతాడు. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఫాలో కాగా సూపర్ పవర్స్ ఉన్న విషయం తెలుస్తుంది. అసలు ఆమె ఎవరు? సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? వాటిని మంచి కోసం వాడినా వచ్చినా ఇబ్బందులేంటి? ఏళ్లుగా ఆమె యవ్వనంగా ఎలా ఉంది? చంద్ర గతం ఏంటి? ఓ పోలీస్ ఆఫీసర్ ఆమె వెంట ఎందుకు పడ్డాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.