కొడుకు సినీ ఎంట్రీ పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పవన్ మాజీ భార్య రేణు దేశాయ్. తాజాగా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతున్నారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో రవితేజ సోదరిగా రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇప్పటికే రవితేజ నార్త్ లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ తో బిజీ అవుతున్నారు. అయితే తాజాగా రేణు దేశాయ్ 'టైగర్ నాగేశ్వరరావు' ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'టైగర్ నాగేశ్వరరావు' విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అఖిరా నందన్ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకిరా హీరోగా ఎప్పుడు పరిచయం అవుతారు? అనే ప్రశ్నకు బదులిస్తూ..


"ఆఖీరాకి హీరోగా చేయాలని ఆసక్తి ఈ క్షణం వరకు లేదు. అతన్ని చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. దాంతోపాటు ఫిలిం ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ అంటే ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. ఇవన్నీ చేసినా ఇప్పటివరకు నటుడిని అవుతానని మాత్రం నాతో చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ఆఫీషయల్ గా అనౌన్స్ చేస్తా" అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.


అంతేకాకుండా.. అఖీరా సినిమాల్లోకి రావాలని మీరు కోరుకుంటారా? అని అడిగినప్పుడు, "కొడుకుని బిగ్ స్క్రీన్ పై చూడాలని ప్రతి తల్లికి ఉంటుంది. నాకు కూడా ఉంది. అయితే హీరో అవ్వాలని ముందు తనకి అనిపించాలి. తను చూడడానికి అందంగా ఉంటాడు. ఒక యాక్టర్ కి కావలసిన అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకు ఉంటుంది" అని చెప్పారు. రేణు దేశాయ్ చెప్పినదాని ప్రకారం అకిరాని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి రేణు దేశాయ్ కి ఇష్టమే, కానీ హీరో అవ్వాలని అకిరా అనుకుంటే అది సాధ్యమవుతుంది.


ఇక 'టైగర్ నాగేశ్వరావు' సినిమా గురించి చెబుతూ.." అభిషేక్ నిర్మాణంలో పనిచేయడం, రవితేజ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అన్నిటికంటే హేమలతా లవణం పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తాను. రవితేజ గారితో పనిచేయడం కచ్చితంగా గొప్ప అనుభూతి. ఈ మూవీ ట్రైలర్ చూసిన మా అమ్మాయి, వయసుకు తగ్గ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉంది అని చెప్పింది. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్" అని చెప్పుకొచ్చింది. ఇక చివరగా ఇప్పటినుంచి నటన కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ, 'నాకు నటన ఎప్పుడు కొనసాగించాలని ఉంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను' అంటూ చెప్పారు.


Also Read : నేను నమ్మిందే తీస్తా, దానికి ఎవరి పర్మిషన్ అవరసం లేదు - ‘ప్యాకేజి’ డైరెక్టర్ బిరుదుపై వర్మ రియాక్షన్!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial