Renu Desai Shared Post on Ex Husband Pawan Kalyan Victory:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భారీ విజయం సాధించారు. ఈ సారి ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. వైసీపీకి ఎక్కడా కూడా చాన్స్‌ ఇవ్వకుండా కూటమీ క్లీన్ స్వీప్‌ చేసింది. ప్రస్తుతం ఏపీ ప్రజంతా కూటమి కూటమి అంటున్నారు. ఇక పిఠాపురంలో పవన్‌ 69 వేల ఓట్ల మెజారిటీ వంగా గీతాపై ఘన విజయం సాధించారు.  కొద్ది సేపటి క్రితమే ఆయన గెలుపు ఖరారైంది. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం పవన్‌ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటుంది.


ఆద్య, అకిరాలు ఫుల్ హ్యాపీ


Renus Desai Post on Pawan Kalyan: అలాగే ఆయన మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై స్పందించారు. ఆయన విక్టరీని చీర్‌ చేస్తూ ఆసక్తికరంగా కూతురు ఆద్య వీడియోను షేర్‌ చేశారు. జనసేన పార్టీ గ్లాస్‌ గుర్తుకు సింబాలిక్‌గా ఆద్య వీడియో షేర్‌ చేశారు. ఇందులో ఆద్య గ్లాస్‌లో కూల్‌ డ్రింగ్‌ తాగుతూ కనిపించింది. దీనికి "ఆద్య, అకీరాలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ మాజీ భర్త పవన్‌ విజయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. 






ఈ వీడియోకి ఆమె ఇచ్చిన బ్యగ్రౌండ్‌ సాంగ్‌ గుస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మహాంకాళి స్పిర్చివల్‌ మెలోడి సాంగ్‌ యాడ్‌ చేస్తూ పవన్ విజయాన్ని ఇలా స్వాగతించారు. దీంతో ఆమె పోస్ట్‌ పవర్‌ స్టార్‌ అభిమాలను బాగా ఆకట్టుకుంటుంది. కాగా రేణు దేశాయ్‌ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పవన్‌ప పరోక్షంగా విమర్శిస్తునే ఉంటారు. పర్సనల్‌ ఆయన ఎలాంటి వారైన ఒక నాయకుడి ప్రజలను మంచి చేయాలని లక్ష్యంతో ఉన్నారంటూ పవన్‌కు మద్దతు ఇస్తుంటారు.


Also Read: పవన్‌ కళ్యాణ్ చేతుల్లో ఏపీ సేఫ్‌ - మెగా హీరో ఆసక్తిర ట్వీట్‌, నితిన్‌ ఎమోషనల్‌ పోస్ట్


గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని సోషల్‌ మీడియాలో ఓటర్లకు పిలుపు నిచ్చారు. అయితే ఈసారి రేణు దేశాయ్‌ మొదటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. ఎనాడు ఏపీ రాజకీయాలపై స్పంచారు. పరోక్షంగానూ ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. కానీ తెలంగాణ బీజేపీ లోక్‌సభ మహిళా అభ్యర్థి మాధవి లతకు సపోర్టు చేయడం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఫస్ట్‌ టైం రాజకీయాల్లో ఓ స్ట్రాంగ్‌ ఉమెన్‌ని చూశానంటూ ఆమెను ఓటేయాలని పేర్కొన్నారు. తన మాజీ భర్తకు కాకుండా తెలంగాణ పాలిటిక్స్‌పై స్పందించడంపై అందరు సర్‌ప్రైజ్‌ అయ్యారు. కానీ ఇప్పుడు పవన్‌ గెలుపుపై రేణు దేశాయ్‌ స్పందించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.