Indian 2 Nizam rights : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ 2022లో 'విక్రమ్' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆ ఏడాది కోలీవుడ్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'విక్రమ్' సక్సెస్ తర్వాత కమల్ ప్రజెంట్ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన సినిమాల్లో 'ఇండియన్ 2' కూడా ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన 'ఇండియన్' మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి తెలుగు బిజినెస్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి.
సురేష్ ప్రొడక్షన్స్ & ఏషియన్ సినిమాస్ చేతికి 'ఇండియన్ 2' రైట్స్
శంకర్ - కమలహాసన్ కాంబినేషన్లో 1996లో వచ్చిన 'ఇండియన్' మూవీని తెలుగులో 'భారతీయుడు' పేరుతో విడుదల చేశారు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్స్ అందుకుంది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' పై టాలీవుడ్ లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే సినిమా నైజాం, ఆంధ్ర రైట్స్‌ను ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP (సురేష్ ప్రొడక్షన్స్ & ఏషియన్ సినిమాస్) వారు దక్కించుకున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అడ్వాన్స్ గా ఎంత మొత్తం ఇచ్చారు అనేది తెలియకపోయినా భారీ ధరకే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. కాగా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఎన్. వి ప్రసాద్ సీడెడ్ లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
దిల్ రాజుకి ఊహించని షాక్
మామూలుగా కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించే సినిమాలను ఇన్నాళ్లు తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాని కూడా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాంతో కచ్చితంగా ఈ మూవీని దిల్ రాజు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా లైకా ప్రొడక్షన్స్ దిల్ రాజుని కాదని ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ వారికి ఛాన్స్ ఇవ్వడం విశేషం.
'ఇండియన్ 3' కూడా..
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 తో పాటు పార్ట్-3 చేంజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. 'భారతీయుడు 2' తర్వాత దానికి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా విడుదల కానుంది. 'ఇండియన్ 2' సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత సినిమా అవుట్ పుట్ పట్ల శంకర్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారట. సన్నివేశాలు అద్భుతంగా రావడంతో వాటిని కుదించడం ఇష్టం లేక 'ఇండియన్ 3' చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ ఏడాది వేసవిలో 'ఇండియన్ 2' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే లేదా జూన్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఆ తర్వాత దీపావళికి 'ఇండియన్ 3' విడుదల చేయాలని భావిస్తున్నారట.
Also Read : తమ్ముడి కోసం వెళ్తే అన్న దొరికాడు, డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్?