Nikhil’s SPY : హీరో నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ 'స్పై' సినిమాతో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కొన్ని రోజుల క్రితమే రిలీజైంది. దీనికి అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్‌లోని అద్భుతమైన విజువల్స్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ స్పై తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ, శాటిలైట్) రైట్స్ కలిపి దాదాపు రూ.17 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. రికార్డ్ బిజినెస్ చేయడంతో ఈ చిత్రం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. నిఖిల్ కెరీర్‌లో ఈ స్థాయిలో బిజినెస్ కావడం ఇదే ఫస్ట్ టైమ్.


ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా బిజినెస్ ను [థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రెండూ] చేసింది. ఇది సినిమా విడుదలకు ముందే నిర్మాతను సూపర్ ప్రాఫిట్ జోన్‌లో ఉంచింది. అంతే కాకుండా నిఖిల్ సినిమాకి ఇదే అత్యధిక ప్రీ బిజినెస్. ఆంధ్రాలో రూ. 6 కోట్లు, నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్ రూ.2 కోట్లు, ఓవర్సీస్లో రూ.1.75కోట్లు, ఇతర రాష్ట్రాలు రూ.70 లక్షలకు విక్రయించారని పలు లెక్కలు కూడా వైరల్ అవుతున్నాయి. 'స్పై' సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.22 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అంటే దాదాపు రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలనే సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'స్పై'ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం, నిఖిల్ సినిమాలకు నార్త్ లో డిమాండ్ ఏర్పడటం, స్పై మీద అంచనాలు ఉండటంతో ఈ కలెక్షన్స్ ఈజీగానే వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను రూ.20 కోట్ల బడ్జెట్ తెరకెక్కించారు.


'స్పై' చిత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కోణంలో తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకి నిర్మాత రాజశేఖర్ రెడ్డినే కథ అందించారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్‌లు ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ నటించింది. వీరిద్దరితో పాటు హీరో ఆర్యన్ రాజేష్ కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సన్యా ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమఠం వంటి నటీనటులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇవ్వగా శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. కాగా ఇప్పటికే ట్రైలర్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి మార్కులు పడ్డాయి. యాక్షన్‌తో కూడిన ఈ స్పై థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్


'కార్తీకేయ-2'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్.. తన తర్వాతి సినిమాలను గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వరుసగా అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం మరో చెప్పుకోదగిన విషయంగా తోస్తోంది. ‘స్వయంభు’ సినిమాతో పాటు హీరో రామ్ చరణ్ నిర్మిస్తోన్న ‘ది ఇండియా హౌస్’ చిత్రం కూడా నిఖిల్ లైన్‌లో ఉన్నారు. వీటి తర్వాత ‘కార్తికేయ- 3’ పట్టాలెక్కనున్నట్టు సమాచారం.


Read Also : Udhayanidhi Stalin - హీరో సూర్య ఆ డైలాగ్ తీయించేశాడు, అది పెద్ద మిస్టేక్: ఉదయనిధి స్టాలిన్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial