RC16 Pooja Ceremony Video: ‘ఉప్పెన’తో టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చి బాబు సానా. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ దర్శకుడి టేకింగ్ నచ్చిన ప్రేక్షకులు.. తన రెండో సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇంతలోనే ముందుగా ఎన్‌టీఆర్‌తో బుచ్చి బాబు సినిమా ఉంటుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ కథ ఎన్‌టీఆర్ నుండి రామ్ చరణ్ చేతికి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా అవే నిజమయ్యాయి. తాజాగా బుచ్చి బాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 16’ పూజా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.


అఫీషియల్ వీడియో..


రెండో సినిమాతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు బుచ్చి బాబు. అంతే కాకుండా ఈ సినిమాలో క్యాస్ట్ దగ్గర నుండి క్రూ వరకు అందరూ సీనియర్లే. ‘ఆర్‌సీ 16’లో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్.. ‘ఆర్‌సీ 16’ను భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సిద్ధమయ్యింది. దాంతో పాటు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ మూవీ ప్రొడక్షన్‌లో భాగమయ్యారు. దీని లాంచ్‌కు మూవీ టీమ్‌తో పాటు మరికొందరు స్పెషల్ గెస్టులు కూడా హాజరయ్యారు. ఇక ఈ పూజా కార్యక్రమం ఎలా జరిగిందో సోషల్ మీడియాలో కొన్ని లీక్ అయిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అఫీషియల్ ఓపెనింగ్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్.. తమ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది.



కమిట్‌మెంట్స్‌ను పక్కన పెట్టిన రెహమాన్..


‘ఆర్‌సీ 16’ పూజా కార్యక్రమానికి రామ్ చరణ్‌తో పాటు తన భార్య ఉపాసన కూడా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్టుగా వచ్చి ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ ఈవెంట్‌కు తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి వచ్చింది జాన్వీ. ‘గేమ్ ఛేంజర్’ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ వచ్చి ‘ఆర్‌సీ 16’కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ ఈవెంట్ కోసమే స్పెషల్‌గా చెన్నై నుండి వచ్చారు ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం రెహమాన్.. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ఆడుజీవితం’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయినా ఆయన కమిట్‌మెంట్స్‌ను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చారు.


బుచ్చి బాబుపై ప్రశంసలు..


ఈ పూజా కార్యక్రమంలో రామ్ చరణ్, ఏ ఆర్ రెహమాన్‌తో పాటు ఇతర మూవీ టీమ్ కూడా బుచ్చి బాబు గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ‘ఆర్‌సీ 16’ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుందని, కథ ఓ రేంజ్‌లో ఉంటుందని బయటపెట్టారు. సుకుమార్ అసిస్టెంట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బుచ్చి బాబు. చాలాకాలం సుకుమార్ దగ్గరే అసిస్టెంట్‌లాగా పనిచేసిన తర్వాత ‘ఉప్పెన’తో డైరెక్టర్ అయ్యే ఛాన్స్‌ను కొట్టేశారు. మొదటి సినిమానే ప్రేమకథగా ఎంచుకున్న బుచ్చి బాబు.. దీనిని ఒక రొటీన్ ప్రేమకథగా తెరకెక్కించకుండా ఇందులో ఒక సోషల్ మెసేజ్‌ను యాడ్ చేశారు. దీంతో ప్రేక్షకులకు తను ఎంచుకున్న అంశం చాలా నచ్చింది. అందుకే తన మొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ కూడా వరించింది.


Also Read: ‘పుష్ప 2’ మేకర్స్‌పై అల్లు అర్జున్ సీరియస్ - కారణం అదేనా?