దర్శకుడిగా, నిర్మాతగా మారుతున్నారు ప్రముఖ కథానాయకుడు రవి మోహన్ (Ravi Mohan). కెమెరా ముందు కనిపించిన ఆయన... కెమెరా వెనక్కి వెళ్తున్నారు. 'రవి మోహన్ స్టూడియోస్' పేరుతో ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మొదటి సినిమాగా 'బ్రో కోడ్' ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ టీజర్ విడుదల చేశారు. అది కాకుండా ఆయన దర్శకత్వంలో మరొక సినిమా అనౌన్స్ చేశారు.
రవి మోహన్ దర్శకత్వంలో యోగి బాబుRavi Mohan to direct Yogi Babu: నిర్మాతగా రవి మోహన్ మొదటి సినిమా 'బ్రో కోడ్'. దర్శకుడిగా ఆయన మొదటి సినిమాలో యోగి బాబు హీరోగా నటించనున్నారు. 'రవి మోహన్ స్టూడియోస్' లాంచ్‌లో అది అనౌన్స్ చేశారు. ఆ సినిమా గురించి యోగి బాబు మాట్లాడుతూ... ''ఆరేళ్ల క్రితం 'నేను దర్శకత్వం చేస్తే ఆ సినిమాలో హీరోగా అవకాశం ఇస్తా' అని రవి మోహన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమా చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన ఆయనకు థాంక్స్'' అని అన్నారు.
రవి మోహన్ స్టూడియోస్ తన కోసం కాదని, కొత్త - యువ దర్శకులకు సైతం తాను అవకాశాలు ఇస్తానని రవి మెహన్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఎంతో మంది కలలకు రూపం ఇవ్వడం కోసం సొంత స్టూడియో పెట్టాను, మా సంస్థలో సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రాజెక్టులు చేస్తాం. కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తా'' అని అన్నారు.
ఆసక్తికరంగా 'బ్రో కోడ్' సినిమా టీజర్!Bro Code Movie Cast: రవి మోహన్ స్టూడియోస్ సంస్థలో ఫస్ట్ ప్రొడక్షన్ 'బ్రో కోడ్'. అందులో రవి మోహన్, ఎస్.జె. సూర్య, అర్జున్ అశోకన్ హీరోలు. గౌరీ ప్రియా, శ్రద్ధా శ్రీనాథ్, మాళవికా మనోజ్ హీరోయిన్లు. ఐశ్వర్యా రాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ముగ్గురు హీరోల మధ్య బాండింగ్ మాత్రమే కాదు... సాధారణంగా పురుషుల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రానికి కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: గ్రాండ్‌గా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసిన రవి మోహన్... సెలబ్రిటీలు ఎవరెవరు అటెండ్ అయ్యారో చూశారా?