Ravi Mohan Studios Launch: గ్రాండ్‌గా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసిన రవి మోహన్... సెలబ్రిటీలు ఎవరెవరు అటెండ్ అయ్యారో చూశారా?
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన తమిళ కథానాయకుడు రవి మోహన్. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ చాలా పాపులర్. ఆయన తల్లి వరలక్ష్మి తెలుగువారే. హీరోగా పలు హిట్ సినిమాలు చేయడంతో పాటు మంచి పేరు తెచ్చుకున్న రవి మోహన్... ఇప్పుడు తన పేరు మీద ప్రొడక్షన్ హౌస్ 'రవి మోహన్ స్టూడియోస్' లాంచ్ చేశారు. ఆ ఈవెంట్‌కు ఎవరెవరు వచ్చారో చూడండి.
రవి మోహన్ తల్లి వరలక్ష్మి 'రవి మోహన్ స్టూడియోస్' లాంచ్‌కు వచ్చారు. ఆ వేడుకలో సందడి చేసిన సెలబ్రిటీలు అందరిలో ఆవిడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రవి మోహన్ జీవితంలో ముఖ్యమైన మహిళా కెనీషా. ప్రస్తుతం వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆవిడ కూడా 'రవి మోహన్ స్టూడియోస్' ప్రారంభోత్సవంలో సందడి చేశారు.
రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా సందడి చేశారు. జెనీలియా తనకు మంచి స్నేహితురాలు అని రవి మోహన్ పేర్కొన్నారు.
''నేను రవి మోహన్ కోసం ఏమైనా చేస్తాను. అతను చాలా మంచి వ్యక్తి'' అని కన్నడ నటుడు డాక్టర్ శివరాజ్ కుమార్ తెలిపారు. ఆయనొక సినిమాకు క్లాప్ ఇచ్చారు.
రవి మోహన్ అన్నయ్య, ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా తమ్ముడి కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో రవి మోహన్