Megastar Chiranjeevi's OTT Platform Locked: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మరో లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఆ ఓటీటీలోకి
'విశ్వంభర' మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ ధరకు ఈ డీల్ కుదిరిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
టీజర్ అదుర్స్
ఈ మూవీకి 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా... ఇటీవల చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. విజువల్ వండర్‌గా వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యం ఉన్న స్టోరీలో భారీ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎంతోకాలంగా మారణ హోమం, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న ఓ సమూహాన్ని రక్షించే ఓ యోధుడిగా మెగాస్టార్ కనిపించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... గ్లింప్స్ పదింతలు హైప్ క్రియేట్ చేసింది.
Also Read: సైకిల్‌పై ఆదోని To హైదరాబాద్ - లేడీ ఫ్యాన్ అభిమానానికి ఫిదా... మా మంచి మెగాస్టార్ ఏం చేశారంటే?
ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే 'నా సామిరంగ' ఫేం ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తుండగా... ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా... ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కోసం మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందు కోసమే కాస్త ఆలస్యం అవుతున్నట్లు ఇటీవలే మెగాస్టార్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.