Megastar Chiranjeevi Helps Lady Fan Family: మెగాస్టార్ చిరంజీవి... ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం నటనతోనే కాకుండా తన సామాజిక సేవతోనూ ఎందరి హృదయాలనో ఆయన గెలుచుకున్నారు. మెగాస్టార్ మహోన్నత వ్యక్తిత్వం, సేవా తత్వం ఆయన్ను ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుపుతోంది. తాజాగా చిరంజీవి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
సైకిల్‌పై ఆదోని To హైదరాబాద్
ఏపీలోని కర్నూలు ఆదోనికి చెందిన రాజేశ్వరి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఆయన్ను ఎలాగైనా చూడాలి, కలవాలనే ఉద్దేశంతో సైకిల్‌పై ఏకంగా ఆదోని నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లను తట్టుకుని చిరంజీవిపై ఉన్న అపారమైన అభిమానంతో ఈ సాహసోపోతమైన జర్నీని చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఆమెను హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
రాజేశ్వరి తనపై చూపిన అభిమానానికి చిరంజీవి ఫిదా అయిపోయారు. ఆమె అంకితభావం, తనను చూసేందుకు ఆమె చేసిన కృషికి చలించిపోయిన చిరు ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆమె రాఖీ కట్టారు. ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన చిరు... ఓ సంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. ఆమెతో మాట్లాడి కుటుంబం, పిల్లల విషయాలను తెలుసుకున్నారు. వారితో ఫోటోలు దిగారు.
Also Read: కింగ్... మన్మథుడు... ఎవర్ గ్రీన్ గ్రీకు వీరుడు - కేరాఫ్ అడ్రస్ వన్ అండ్ ఓన్లీ 'నాగార్జున'
పిల్లల చదువుల కోసం...
రాజేశ్వరి పిల్లల చదువు, భవిష్యత్తుకు చిరంజీవి భరోసా ఇచ్చారు. వారి విద్య కోసం పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆయన గొప్ప మనసును కొనియాడుతున్నారు. అభిమానులను కేవలం అభిమానుల గానే కాకుండా తన కుటుంబ సభ్యుల్లాగా చిరంజీవి చూసుకుంటారని... ఆయన గొప్ప తనానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.