Secrets behind Ashoka's 9 unknown men: యంగ్ హీరో తేజ సజ్జా కొత్త సినిమా "మిరాయి" ట్రైలర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తక్కువ బడ్జెట్లో ఆ స్థాయి విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న కథాంశం ఫై నెట్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ లలో చూపించిన ఒక ముఖ్యమైన పాయింట్ పై జనాల్లో ఆసక్తి మొదలైంది. అదే "మౌర్య చక్రవర్తి అశోకుడు స్థాపించిన తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తుల రహస్య సమూహం. వేల సంవత్సరాలనుంచి వాళ్ళు కాపాడుతున్న సీక్రెట్." చాలాకాలంగా చర్చిలో ఉన్న చర్చ లో ఉన్న ఈ తొమ్మిది మంది అజ్ఞాతవ్యక్తుల సీక్రెట్ సొసైటీ నిజంగానే గానే ఉందా? వాళ్ళ కాపాడుతున్న రహస్యం ఏంటి>?
వందేళ్ల క్రితమే ఈ తొమ్మిది మంది అజ్ఞాతవ్యక్తుల గురించిన ప్రస్తావన
చారిత్రకంగా ప్రూవ్ కానప్పటికీ చాలా ఈళ్లుగా ఏళ్లుగా అశోక చక్రవర్తి 9 మంది వ్యక్తులతో కూడిన ఒక సీక్రెట్ సొసైటీని స్థాపించారనే ప్రస్తావన ఉంది. ప్రళయాన్ని సృష్టించగల ఒక మహా శక్తి గురించిన రహస్యాన్ని ఆ తొమ్మిది మంది కాపాడుతున్నారనేది చాలామంది నమ్మే ఒక గాధ. పుస్తక రూపంలో దీన్ని 1906లో తొలిసారి పరిచయం చేసింది మాత్రం టాల్బోట్ ముండే (Talbot Munday ) అనే రచయిత. The Nine Unknown అనే పుస్తకం లో ఆయన దీని గురించి ప్రస్తావించాడు. ఈ పుస్తకం ఆధారంగా 1960లో లూయిస్ పావెల్స్ అనే రైటర్ (Louis Pauwels) 'ది మార్నింగ్ ఆఫ్ ది మెజీసషియన్స్ ' అనే నవల రాసాడు.
ఈ తొమ్మిది మంది వ్యక్తులు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అడ్వాన్స్డ్ సీక్రెట్ లను కాపాడుతూ ఉంటారని వాటిని చెడ్డవాళ్ళ చేతుల్లో పడకుండా ఉండేందుకు అశోక చక్రవర్తి ఈ ఏర్పాటు చేశారని అంటారు. వరుస యుద్దాల తర్వాత శాంతి వైపు మళ్ళిన అశోకుడు అనుకోకుండా ఈ విజ్ఞానానికి సంబంధించిన రహస్యాలను కొనుగొనడం అవి దుర్మార్గుల చేతుల్లో పడితే ప్రపంచం మళ్లీ యుద్ధాలతో ప్రళయం బారిన పడుతుందని భావించి ఆ జ్ఞానాన్ని కాపాడడం కోసం తొమ్మిది మంది వ్యక్తులను ఎన్నుకుని 270(BCE )లో ఈ సీక్రెట్ సొసైటీని ప్రారంభించారు అనేది ఒక లెజెండ్.
ఆసక్తికర విషయం ఏంటంటే... ఆ తొమ్మిది మంది ఎవరికి రెండో వ్యక్తితో పరిచయం ఉండదు. ఏటా ఒక నిర్ణీత సమయంలో వాళ్ళు ఒక ప్లేస్ లో కలుసుకుంటారట. వాళ్లలో ఎవరైనా చనిపోతే మరొక కొత్త వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేయడం వంటి సంప్రదాయాలతో వేల సంవత్సరాలుగా మన మధ్య తిరుగుతూ అ రహస్య జ్ఞానాన్ని కాపాడుతున్నారనేది ఈ తొమ్మిది మంది అజ్ఞాతవ్యక్తుల గాధలు చెబుతున్నాయి.
ఈ తొమ్మిది మంది అజ్ఞాతవ్యక్తుల గురించి ఎన్నో పుస్తకాలు..
ఈ 9 మంది అజ్ఞాత వ్యక్తులు కాపాడుతున్న రహస్యం గురించి అనేక గాధలు ప్రచారం లో ఉన్నాయి. వారు కాపాడేది ఇనుమును బంగారంగా మార్చే పరుసవేది రహస్యం అనీకొంతమంది నమ్మితే అశోక చక్రవర్తి అనుకోకుండా కనుగొన్న మహాభారత యుద్ధం కాలం నాటి విధ్వంసకర ఆయుధాలకు సంబంధించిన రహస్యం అని ప్రస్తుత కాలానికి అవి సరిపడవని అందుకే వాటిని దాచేసిన రహస్య స్థలం గురించిన సమాచారం అనీ ఎక్కువమంది భావిస్తారు. దీనికి సంబంధించి చాలా నవల్స్ కూడా పాపులర్ సాహిత్యంలో ఉన్నాయి. అవి చాలావరకు "ది డావిన్సీ కోడ్" ఫార్మాట్ లో ఉంటాయి. అందుకే దీనిని ఒక పుక్కిట పురాణంగా చరిత్రకారులు కొట్టి పడేస్తుంటారు. కానీ చాలామంది మాత్రం ఈ" తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తుల రహస్యం " నిజమేనని వందేళ్ళ క్రితమే దీని ప్రస్తావన పుస్తక రూపం లో ఉన్న విషయం మర్చిపోకూడదని చెబుతుంటారు. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తున్న "మిరాయ్" సినిమా ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.