రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ రిలేషన్ గురించి వస్తున్న రూమర్లపై ఇద్దరూ ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. కానీ అప్పుడప్పుడు ఆ వార్తలు నిజమేనేమో అనిపించేలా హింట్ ఇస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్ మరోసారి విడివిడిగా విమానాశ్రయంలో కనిపించి వార్తల్లో నిలిచారు. దీంతో పెళ్లికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రయాణం
2024 పూర్తి కావడంతో ఇప్పటి నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హడావుడి మొదలైపోయింది. పలువురు సెలబ్రిటీలు క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ ను కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే విదేశాలకు పయనం అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కూడా విమానాశ్రయంలో కనిపించడం కొత్త డౌట్లకు తెర తీసింది. అయితే వీరిద్దరూ కలిసి కనిపించలేదు కానీ, విడివిడిగా ఎక్కడికో బయలుదేరారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, న్యూ ఇయర్ ను కలిసి సెలెబ్రేట్ చేసుకోవడానికి వీరిద్దరూ విడివిడిగా ఒకే ప్రదేశానికి వెళ్తున్నారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇక ఆ వైరల్ వీడియోలో రష్మిక మందన్న అభిమానులతో మాట్లాడడమే కాదు, వారితో ఫోటోలు కూడా దిగింది. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత రష్మిక మందన్న ఫుల్ హ్యాపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రష్మిక మందన్న బ్యాగీ జీన్స్, నల్లని స్వెట్ షర్ట్ ను ధరించి సింపుల్ గా కనిపించింది. అలాగే విజయ్ దేవరకొండ క్యాజువల్ లుక్స్ లో కనిపించారు.
Also Read: 'రైఫిల్ క్లబ్' రివ్యూ: మలయాళ సినిమాలో ఏముంది? ఎందుకంత స్పెషల్?
పెళ్లిపై రూమర్స్
అయితే ఈ జంట ఇటీవల కాలంలో తమపై వస్తున్న రూమర్స్ గురించి చెప్పి చెప్పనట్టుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. 'పుష్ప 2' ఈవెంట్లో రష్మిక మందన్న 'అతడు ఎవరో మీకు తెలుసు' అంటూ కామెంట్ చేయడంతో అందరూ విజయ్ దేవరకొండ గురించే రష్మిక మందన్న చెబుతుందని ఫిక్స్ అయ్యారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా తన రిలేషన్షిప్ గురించి టైం వచ్చినప్పుడు తానే చెప్తానని క్లారిటీ ఇచ్చారు. అలాగే "2025లో పెళ్లి చేసుకుంటారా ?" అన్న ప్రశ్నకు రీసెంట్ గా రజనీకాంత్ పై ట్రెండ్ అయిన, 'ఏదైనా జరగొచ్చు' అన్నట్టుగా ఉన్న ఓ వీడియోని రిప్లై గా పోస్ట్ చేశాడు. దీంతో మొత్తానికి వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక తాజాగా ఈ జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయలుదేరడంతో, పెళ్లికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్ కాబోతోందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న క్రేజ్ పీక్స్ లో ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. మరి ఈ జంట నిజంగానే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.