Rashmika mandanna Super Words About Anand Devarakonda : 'గంగం గ‌ణేశా'.. ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన ఈసినిమా మే 31న రిలీజ్ కానుంది. క్రైమ్ కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు. ఆ ఈవెంట్ కి నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఆనంద్ దేవ‌రకొండ గురించి మాట్లాడిన మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఆనంద్ త‌న‌కు బిగ్ బ్ర‌ద‌ర్ అని, ప్రతి విష‌యంలో త‌న వెంట ఉంటాడంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆ మాట‌లు విన్న దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను తెగ షేర్ చేసి వైర‌ల్ చేస్తున్నారు. 


ఆనంద్ ముఖంపై న‌వ్వు చూడాలి.. 


ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ర‌ష్మిక ఆనంద్ తో క‌లిసి డ్యాన్స్ చేశారు. చాలా సందడి చేశారు. ఇక ఆ త‌ర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. "ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒక ప‌ర్స‌న్ ఉంటాడు. వాళ్ల మీద మ‌నం ఆధార‌ప‌డి ఉంటాం. అమ్మైనా, నాన్నైనా, పార్ట‌న‌ర్ అలా ఒక‌రు క‌చ్చితంగా ఉంటారు. సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక అది నాకు బాగా అర్థం అయ్యింది. ఇక ఫ్యామిలీలో ఒక స్ట్రాంగ్ పిల్ల‌ర్ ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఆనంద్ అంటే.. నాకు బ్ర‌ద‌ర్ లాగా. నేను ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రి మీద ఆధార‌ప‌డి ఉంటాను. ఆనంద్‌కు తెలీదు.. నేను అత‌ని మీద చాలా ఆధార‌ప‌డ‌తాను. ఈ సినిమా హిట్ అయితే ఆనంద్ ముఖం మీద న‌వ్వు ఉంటుంది. అందుకే ఆయ‌న ముఖం మీద న‌వ్వు ఉండాలి. ఈ సినిమా హిట్ అవ్వాల‌ని అనుకుంటున్నాను. పాట‌లు చాలా న‌చ్చాయి ఎంజాయ్ చేశాను. ఇక్క‌డే కాదు.. ఇంట్లో కూడా పాట‌లు విని ప్రాక్టీస్ చేశాను" అని చెప్పారు ర‌ష్మిక‌. 


ఇమాన్యుయెల్ లవ్ యూ.. 


ఈ సంద‌ర్భంగా ఆమె సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పేరు పేరున ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ చెప్పారు ర‌ష్మిక‌. ప్రొడ్యూస‌ర్ల‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్తూ సినిమా బాగా ఆడాల‌ని, డ‌బ్బులు బాగా రావాల‌ని కోరుకుంటున్నాని తెలిపారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఇమాన్యుయెల్ పై ప్ర‌శంస‌లు కురిపించారు ర‌ష్మిక‌. "ల‌వ్ యూ ఇమాన్యుయెల్. నీ వీడియోలు న‌న్ను చాలా న‌వ్విస్తాయి. సినిమాలో, ఇక్క‌డ ఎంటర్‌టైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్" అని చెప్పారు ర‌ష్మిక‌.


సాయి రాజేశ్ తో సినిమా తీయాల‌నుంది.. 


"నేను బేబీ చూశాను. మీ డెడికేష‌న్, మీ డైరెక్ష‌న్ నాకు చాలా న‌చ్చింది. మీతో క‌చ్చితంగా సినిమా చేస్తాను. సినిమా చూసేట‌ప్పుడు నాకు క్యూరియ‌స్ గా అనిపించింది. సాయి రాజేశ్ గారితో ఒక సినిమా చేయాలి, మెంట‌ల్ క్యారెక్ట‌ర్ చేయాలి అని అనుకున్నాను" అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు ర‌ష్మిక మంద‌న్న‌. 


రౌడీ రౌడీ అంటూ కేక‌లు.. 


ర‌ష్మిక‌, విజ‌య దేవ‌ర‌కొండ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వహారం న‌డుస్తోంద‌ని, వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలాసార్లు వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు. కానీ, ఫ్యాన్స్ మాత్రం ఏ ఈవెంట్ లో ర‌ష్మిక మాట్లాడినా విజ‌య దేవ‌ర‌కొండ గురించి తీస్తారు. అలానే ఈ ఈవెంట్ లో కూడా ర‌ష్మిక మాట్లాడినంత సేపు రౌడీ రౌడీ అంటూ కేక‌లు వేశారు. అది కాకుండా ఆనంద్ గురించి ర‌ష్మిక స్పెష‌ల్ గా మాట్లాడ‌టంతో ఫ్యాన్స్ గ‌ట్టిగా కేక‌లు వేసి సంద‌డి చేశారు. 


Also Read: రాజేశ్ సినిమా అందుకే చేయ‌డం లేదు, ఆ పాత్ర ట్రై చెయ్యాలని చెప్పా: అల్ల‌రి న‌రేశ్