Allri Naresh’s ‘Bachhala Malli’ Movie First Look: టాలీవుడ్ నటుడు అల్లరి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న సినిమా ‘బ‌చ్చల మ‌ల్లి’. సుబ్బు మంగాదేవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించింది.


సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్  


‘బచ్చల మల్లి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ గతంలో ఎప్పుడూ కనిపించని లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, రిక్షాలో కూర్చొని సిగరెట్ తాగుతూ సీరియస్ గా చూస్తూ కనిపిస్తున్నాడు. మెడకు తాయత్తు, కుడి చేతికి దారాలు, రాగి కడియం, ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్, కాళ్లకు తోలు చెప్పులు వేసుకుని కనిపించాడు. బ్యాగ్రౌండ్ ల బాణాసంచా కాల్చడంతో పాటు దేవుళ్ల గెటప్ లో కొందరు వేషగాళ్లు కనిపిస్తున్నారు. హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ లోని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.


“పేరు – మల్లి


ఇంటి పేరు - బచ్చల


చేసేది - ట్రాక్టర్ డ్రైవింగ్


ఈ "బచ్చల మల్లి" ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు” అంటూ చిత్రబృందం వెల్లడించింది.


యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘బచ్చల మల్లి’


అల్లరి నరేష్ కెరీర్ లో 62వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటెన్స్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమా క‌థ‌ 1990 నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమా ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.






ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘సామాజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి బ్లాక్‌ బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా,  బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సీతా రామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, ‘మానాడు’, ‘రంగం’, ‘మట్టి కుస్తి’ సినిమాలకు పని చేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ ప్లే అందించారు. త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. విడుదల తేదీ పైనా చిత్రబృందం నుంచి వీలైనంత త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


 Read Also: ఇక 'ఎక్స్ట్రా'ల్లేవ్... జస్ట్ 'జబర్దస్త్'... స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ