Allari Naresh About his Brother: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన అన్నదమ్ములు చాలామందే ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, సూర్య, కార్తీ లాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకులు ఆర్యన్ రాజేశ్, అల్లరి నరేశ్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, గత కొద్దిరోజులుగా రాజేశ్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఏ సినిమాలో నటించడం లేదు కూడా. దీనిపై స్పందించారు అల్లరి నరేశ్. ఆయన సినిమాల్లో ఎందుకు నటించడం లేదో కారణం చెప్పారు.
మాకు అలా ఉండాలనిపిస్తుంది..
ఆర్యన్ రాజేశ్ 'హ్యాపీ', 'సొంతం' తదితర సినిమాల్లో నటించాడు. అయితే, ఆయన సినిమాలు అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ మధ్య ఆయన సినిమాలకి పూర్తిగా దూరం అయ్యారు. దాని గురించి అల్లరి నరేశ్ ని ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం చెప్పారు. "నాకు కూడా మేమిద్దం సూర్య లాగా, కార్తీ లాగా సక్సెస్ అవ్వాలి అనుకుంటాం. చిరంజీవి, పవన్ కల్యాణ్ గారిలా ఉండాలని అనుకుంటాం. కానీ, అలా జరగలేదు. 2002లో ఒకేసారి 16 మంది కొత్త హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు. ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్, రాజేశ్ ఇలాంటి వాళ్లు హీరోలుగా కెరీర్ స్టార్ట్ చేశారు. వాళ్లందరూ యాక్షన్, లవ్ స్టోరీలు చేశారు. నేను ఒక్కడినే కామెడీ జోనర్ ఎంచుకున్నాను. కాబట్టి నాకు కాంపిటీషన్ పెద్దగా లేదు. కానీ, రాజేశ్ అలా కాదు తను అప్పటికే ఆ 15 మంది చేస్తున్న యాక్షన్, లవ్ స్టోరీలు వాటిల్లో ఉండిపోయాడు. దాని నుంచి బయటికి రాలేదు. నాన్న ‘హాయ్’ మూవీని బాగా ఖర్చు పెట్టి చేశారు. కానీ, ఆడలేదు. ఆ తర్వాత లీలామహల్, ఎవరి గోల వాడిది లాంటివి హిట్ అయ్యాయి. అయితే అవి వరుసగా హిట్ అవ్వలేదు. అక్కడొక్కటి అక్కడొకటి హిట్ అయ్యింది. అదీ కాకుండా ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. అలా కొన్ని సినిమాలు ఆడలేదు. అది చాలా పెద్ద తలనొప్పి" అని తన సోదరుడి కెరీర్ గురించి చెప్పారు అల్లరి నరేశ్.
నాన్నతో బాండింగ్..
"నాన్న ఉన్నంత వరకు బాగానే ఉంది. నాన్నకి నేను క్లోజ్ అనుకున్నాను. కానీ, రాజేశ్ బాగా దగ్గరయ్యాడు. చివరి నెల రోజుల్లో రాజేశ్ దగ్గరుండి చూసుకున్నాడు. దాంతో ఆయన పోయాక దాని నుంచి బయటికి రాలేకపోయాడు. దాదాపు ఏడాదిన్నర పట్టింది. దాని నుంచి బయటికి రావడానికి. నాన్న లేరు బరువు పడింది ఎలా? అని భయపడ్డాడు. ఆ తర్వాత ప్రొడక్షన్ లోకి రావాలి అనుకున్నాడు. కానీ, నాకు మాత్రం తను యాక్టర్ అవ్వాలి అనేది కోరిక."
విలన్ గా రావాలని..
"ప్రస్తుతం ఇండస్ట్రీలో 35 - 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్లు విలన్ గా లేరు. ఈ జనరేషన్ హీరోలకి విలన్ గా చేయమని చెప్పాను. అప్పటి వరకు అరవింద్ స్వామిని క్లాసిక్ క్యారెక్టర్లు చేసేవాడు. ధృవ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అస్సలు అనుకోలేదు. అందుకే, విలన్ గా ట్రై చేయమని చెప్పాను రాజేశ్ కి. ఆ లుక్స్, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ట్రై చేస్తున్నాడు కానీ, ఛాన్సులు రావడం లేదు. ఎవరైనా ఎక్స్ పరిమెంట్ చేయాలని సినిమా తీయడు కదా. చూద్దాం కచ్చితంగా వాడికి కూడా గ్రాఫ్ పెరుగుతుందని అనుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లే గ్రాఫ్ పడిపోయి ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇప్పుడు పుంజుకున్నారు. అలానే రాజేశ్ కూడా ఏదో ఒక రోజు షైన్ అవుతాడు. ఒక్క మంచి సినిమా పడితే ఆయన కెరీర్ ఛేంజ్ అయిపోతుంది" అని తన మనసులో మాటలను బయటపెట్టాడు అల్లరి నరేశ్.
కామెడీ కష్టం...
అల్లరి నరేశ్ మొదటి నుంచి కామెడీ సినిమాలు చేసి ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చారు. దాని గురించి మాట్లాడుతూ... కామెడీ చేయడం చాలా కష్టం అని చెప్పారు అల్లరి నరేశ్. మనం నవ్వకుండా నవ్వించాలి. నేచురల్ గా చేయాలి. ఏదైనా తేడా వస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడురా అనేస్తారు. కామెడీ చేయడం కష్టం, రాయడం కష్టం. ఏడిపించినంత ఈజీగా నవ్వించలేం.
Also Read: ‘బాహుబలి’ కట్టప్పకు బాలీవుడ్ ఆఫర్ - ఖాన్ సినిమాలో విలన్‌గా ఛాన్స్?