actress Sukanya about her daughter photo viral in social media: సీనియర్‌ నటి సుకన్య (Actress Sukanya) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్ అయిన ఆమె తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా సుపరిచితమే. భారతీయుడు, పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అమ్మ, అక్కడ, వదిన వంటి పాత్రలతో మెప్పిస్తున్న ఆమె కొంతకాలంగా వెండితెరపై కనిపించడం లేదు. తెలుగులో చివరిగా మహేష్‌ బాబు శ్రీమంతుడు మూవీలో కనిపించింది.


ఆమె సుకన్య కూతురా!


Sukanya Daughter Photo Viral: ఆ తర్వాత మరే సినిమలో కనిపించలేదు. అయితే ఈ మధ్య సుకన్యక కూతురు అంటూ ఓ అమ్మాయి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.అది చూసి సుకన్యకు ఇంత పెద్ద కూతురు ఉందా? కొందరు షాక్‌ అవుతుంటే.. ఆమె అసలు పిల్లలు లేరు కదా ఈమే ఎవరా అని ఆరా తీస్తున్నారు. పెళ్లయిన కొన్ని నెలలకే భర్త నుంచి విడిపోయింది. మరి ఇంత పెద్ద కూతురు ఎలా వచ్చిందంటూ అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


అలాగే తన కూతురు అంటూ ప్రచారం జరుగుతున్న ఆ అమ్మాయి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సుకన్య మాట్లాడుతూ.. "సోషల్‌ మీడియాలో నా కూతురు అంటూ వైరల్‌ అవుతున్న ఆ ఫోటోలోని నేను కూడా చూశారు. అవును తను నాకు కూతురే. కానీ నా సొంత కూతురు కాదు. తను నా చెల్లెలి కూతురు. కానీ తనకు కాస్తా నా పోలికలు ఉండటం వల్ల అది నా కూతురిలా నెట్టింట వైరల్ అయింది. అది చూసి అంతా నా కూతురు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నేను సోషల్‌ మీడియాలోనూ స్పష్టం చేశా" అంటూ చెప్పుకొచ్చింది. 


ఎప్పుడో విడాకులు తీసుకున్నా..


అనంతరం తన వైవాహిక జీవితం, విడాకులపై ప్రస్తావించింది. "నాకు పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులయ్యాయి. ఈ విషయం అందరికి తెలుసు. నా మాజీ భర్తతో నేను కొన్ని నెలలు మాత్రమే ఉన్నాను. ఆ తర్వాత ఇద్దరికి సెట్‌ కాలేదు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. కానీ, విడాకులు తీసుకోవానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే కొందరు కావాలనే నా చెల్లెలి కూతురి ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నా కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారు. నా చెల్లెలి కూతురు కూడా అది చూసి పెద్దమ్మ వల్ల నాకు కూడా గుర్తింపు వచ్చిందంటూ మురిసిపోయింది. ఇంట్లో వాళ్లందరికి కూడా ఇదే చెబుతూ సంతోషపడింది" అంటూ సుకన్య అసలు విషయం చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత తల్లి పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఆమె అన్నిభాషల్లో కలిసి 80కి పైగా సినిమాల్లో నటించింది. ఇక సుకన్య నటి మాత్రమేకాదు నర్తకి, సంగీత కళాకారిణి కూడా.