Rashmika Mandanna Commetns Viral On If Mens Get Periods : 'మగవాళ్లకు పీరియడ్స్ వస్తే...' ఈ ప్రశ్నకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న చెప్పిన ఆన్సర్ వైరల్‌గా మారింది. మగాళ్లకు ఓసారి పీరియడ్స్ వస్తే ఆడవాళ్లు పడే బాధ గురించి తెలుస్తుందని ఆమె అన్నారు. తాజాగా... జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో ఆమె తన కెరీర్, సినిమాలు, ఇతర విషయాలు గురించి మాట్లాడారు.
అలా జరిగితే...
'మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండునని ఫీల్ అయినట్లు ఉన్నావ్' అంటూ జగపతి బాబు ప్రశ్నించగా... 'ఎస్' అంటూ ఆన్సర్ చెప్పారు రష్మిక. దీంతో జగపతిబాబుతో పాటు ఆడియన్స్ సైతం నవ్వేశారు. 'మగాళ్లకు ఓసారి పీరియడ్స్ వస్తే... ఆడవాళ్లు పడే బాధ అర్థమవుతుంది. ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకు పీరియడ్స్ రావాలి.' అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు అది నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్ల అందరి బాధను ఆమె వ్యక్తం చేశారంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read : ఊదేయడానికి మట్టి కాదు... నేను ఓ పర్వతం - దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ చూశారా?
అది ఎంగేజ్మెంట్ రింగేనా?
గత కొద్ది రోజులుగా హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగిందంటూ వార్తలు వస్తుండగా... ఆమె చేతికి రింగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. 'చేతికి ఆ రింగ్స్ ఏమైనా సెంటిమెంటా?' అంటూ జగపతిబాబు ప్రశ్నించగా... 'అంటే చాలా ఇంపార్టెంట్ రింగ్స్' అంటూ చెప్పారు. 'వాటిల్లో ఒకటి ఫేవరెట్ రింగ్. దాని వెనుక ఓ హిస్టరీ ఉంది' అంటూ జగపతిబాబు అనగా... ఆమె ఒక్కసారిగా సిగ్గుపడిపోయారు. దీంతో ఇది ఎంగేజ్మెంట్ రింగే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇప్పటివరకూ అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఎంగేజ్మెంట్ వార్తలపై అఫీషియల్‌గా రియాక్ట్ కాలేదు. రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో అభిమాని ప్రశ్నించగా.. 'మీరేం అనుకుంటున్నారో అదే. ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడే చేస్తాను.' అంటూ చెప్పారు.
రష్మిక వరుస సినిమాలతో బిజీగా మారారు. రీసెంట్‌గా ఆమె నటించిన 'థామా' రిలీజ్ అయ్యింది. తాజాగా 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా... దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయెల్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు.