Dulquer Salmaan's Kaantha Trailer Out : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. 1950 టైంలో మద్రాస్ ఇండస్ట్రీలో పరిస్థితులు, ఓ హీరో, గురువుతో సమానమైన ఓ డైరెక్టర్ మధ్య వివాదాలు బ్యాక్ డ్రాప్‌గా మూవీని తెరెకక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుంటుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ ఎలా ఉందంటే?
పవర్ ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ లుక్స్‌తో 'కాంత' ట్రైలర్ అదిరిపోయింది. 'ఓ కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథేరా నిర్ణయిస్తుంది. మోడ్రన్ స్టూడియోస్ నీతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది. కాదు ఒప్పించాను. నువ్వు ఎవరనేది ఈ ప్రపంచానికి తెలియబోతోంది.' అంటూ సముద్రఖని డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఓ యువకుడిని హీరోగా ప్రపంచానికి పరిచయం చేసిన ఓ డైరెక్టర్... గురు శిష్యుల్లా ఉండే ఆ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది.
అయితే, ఆ తర్వాత ఓ సినిమా కోసం ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. సినిమా వల్ల పేరు, ఖ్యాతి గడించిన ఆ హీరో గురువుకే ఎదురెళ్తాడు. తనదైన రీతిలో ఓ సినిమా తీసేందుకు గురువు నుంచే బలవంతంగా ఆధిపత్యాన్ని లాక్కుంటాడు. ఇదే సందర్భంలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీని కూడా బ్యూటిఫుల్‌గా ట్రైలర్‌లో చూపించారు. 'ఇక నుంచి ఇది మీ సినిమా సెట్ కాదు... నా పోలీస్ స్టేషన్' అంటూ రానా చెప్పే డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. అసలు తండ్రీ కొడుకుల్లా ఉండే గురు శిష్యుల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? హీరోయిన్ ఎవరి వైపు నిలబడింది? ఇందులో రానా పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read : ముదిరిన 'మంగళ సూత్రం' వివాదం - ట్విట్టర్‌లో రచ్చ... సింగర్ ట్వీట్‌పై సీపీ సజ్జనార్ రియాక్షన్
రిలీజ్ ఎప్పుడంటే?
మూవీలో దుల్కర్ సినీ హీరోగా సముద్రఖని డైరెక్టర్‌గా కనిపించనున్నారు. స్పెషల్ రోల్‌లో హీరో రానా నటిస్తున్నారు. దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా... స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఝును మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.