రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎవరితో ప్రేమలో ఉన్నారు? ఎవరితో డేటింగ్‌లో ఉన్నారు? నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) తోనా? అంటే... వాళ్ళిద్దరూ ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ, చాలా మంది కన్ఫర్మ్ చేశారు. 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో అనన్యా పాండే 'రష్... మికా' అంటూ వ్యాఖ్యలు చేయడం వంటి వాటి వల్ల విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్ నిజమని ప్రేక్షకులు భావించే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు డేటింగ్ కహానిపై రష్మిక స్పందించారు.
 
ఐదు సినిమాలు చేస్తున్నా... ఈ క్వశ్చన్స్ ఏంటి?
''నేను ఐదు చిత్రాలు చేస్తున్నాను. కానీ, మీరు వచ్చి ఎవరిని డేటింగ్ చేస్తున్నారు? మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోంది? అని అడుగుతున్నారు'' అని ఒక హిందీ మీడియా సంస్థతో రష్మికా మందన్నా కించిత్ అసహనం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న సినిమాలు వదిలేసి... పర్సనల్ లైఫ్ గురించి అడగటం ఆమెకు నచ్చినట్టు లేదు.
 
హీరో హీరోయిన్లు ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తున్న విషయం తాను అర్థం చేసుకుంటానని... అయితే తాను చెప్పే వరకూ ఒక నిర్ణయానికి రావొద్దని రష్మిక విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఉన్న వాటిని నమ్మవద్దని ఆమె అన్నారు. 


కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంతే!
తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తన వ్యక్తిగత జీవితం వార్తల్లో ఉంటోందని రష్మిక పేర్కొన్నారు. ''నేను ఎవరిని చూస్తున్నాను? ఎవరితో ఉన్నాను? అనేది టాపిక్ అవుతోంది'' అని ఆమె చెప్పారు. ఎవరు ఎటువంటి కామెంట్స్ చేసినప్పటికీ... నటీనటులు మాత్రం మంచిగా ఉండాలని రష్మిక తెలిపారు.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా రష్మిక డేటింగ్ రూమర్స్ గురించి స్పందించారు. ''నాకు విజయ్‌ దేవరకొండ మంచి ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు'' అని ఆమె స్పష్టత ఇచ్చారు. తాను ఇప్పటికీ సింగిల్‌ అని వెల్లడించారు. గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మికా మందన్నా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు క్యాన్సిల్ చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో బిజీ కావడంతో రక్షిత్ శెట్టికి ఆమె బ్రేకప్ చెప్పారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.  


Also Read : విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!


సినిమాల్లో ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్
'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా తొలిసారి జంటగా నటించారు. అందులో ఇద్దరి కెమిస్ట్రీకి సూపర్ రెస్పాన్స్ లభించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' చేశారు. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. సినిమా వేడుకలు కాకుండా... అప్పుడప్పుడూ గెట్ టుగెదర్ పార్టీల్లో కూడా ఇద్దరూ కనిపిస్తారు. కొన్నిసార్లు జిమ్‌లో కనిపిస్తారు. 


Also Read : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి