'ఖైదీ' (Khaidi Movie) సినిమా ఓ సంచలనం. ఎందుకంటే... ఆ సినిమాలో పాటలు లేవు, హీరోయిన్ ఎవరూ లేరు, హీరోకి రొమాంటిక్ ట్రాక్ అనేది లేదు. పైగా... సినిమా అంతా హీరో ఒకే కాస్ట్యూమ్‌లో కనిపిస్తాడు. అయినప్పటికీ... సినిమా భారీ విజయం సాధించింది. తమిళనాడులో మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్, హీరో కార్తీలకు మంచి పేరు తీసుకు వచ్చారు.
 
విజయ్ సినిమా తర్వాత...
ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా (Thalapathy 67) రూపొందుతోంది. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత 'ఖైదీ 2' (Kaithi 2 Movie) స్టార్ట్ అవుతుందని కార్తీ చెప్పారు. ఈ శుక్రవారం (ఆగస్టు 12న) ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'విరుమాన్' తమిళంలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో కార్తీ సమావేశం అయ్యారు. అప్పుడు 'ఖైదీ 2' గురించి చెప్పారు.
 
''మేం నెక్స్ట్ ఇయర్ 'ఖైదీ 2' ప్లాన్ చేస్తున్నాం. విజయ్ సార్ సినిమా లోకేష్ ఫినిష్ చేసిన తర్వాత మేం స్టార్ట్ చేస్తాం'' అని కార్తీ పేర్కొన్నారు.


కమల్ హాసన్ 'విక్రమ్'లో హింట్...
కమల్ హాసన్ 'విక్రమ్ : ది హిట్ లిస్ట్' (Vikram Movie) తో దర్శకుడు లోకేష్ కనకరాజ్ భారీ బాక్సాఫీస్ విజయం అందుకున్నారు. ఆ చిత్రానికి, 'ఖైదీ' చిత్రానికి లింక్ ఉంది. 'విక్రమ్' సినిమా ఎండింగ్‌లో 'ఖైదీ 2' గురించి, అందులో కార్తీ క్యారెక్టర్ ఢిల్లీ క్యారెక్టర్ గురించి హింట్ కూడా ఇచ్చారు. అంతకు ముందే 'ఖైదీ 2' ఉంటుందని చెప్పారు కూడా! అయితే... 'ఖైదీ 2' కంటే ముందు విజయ్ 'మాస్టర్', 'విక్రమ్' చేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు విజయ్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు.


తమిళ స్టార్స్‌తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా?
'విక్రమ్'లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించారు. ఆయన తెరపై కనిపించింది కాసేపే అయినప్పటికీ... ఆ ప్రభావం ప్రేక్షకులపై బలంగా పడింది. రోలెక్స్ పాత్రను బేస్ చేసుకుని ఒక సినిమా ఉంటుందని లోకేష్ తెలిపారు. 'విక్రమ్ 2'లో కూడా సూర్య కనిపించే అవకాశాలు ఉన్నాయి. 'విక్రమ్ 2'లో కమల్ హాసన్ మనవడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా లోకేష్ మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.


Also Read : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు
 
కమల్ హాసన్, సూర్య, కార్తీలతో లోకేష్ కనకరాజ్ భారీ మల్టీస్టారర్ (సినిమాటిక్ యూనివర్స్) సినిమా చేయనున్నారని కోలీవుడ్ టాక్. అయితే... విజయ్ సినిమా కూడా ఆ సినిమాటిక్ యూనివర్స్‌లో ఉంటుందనేది మరో టాక్. దళపతి 67 సినిమా ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెబుతారేమో చూడాలి.  


Also Read : ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!